Begin typing your search above and press return to search.
ఉద్యోగం పోతుందని లేడీ టెక్కీ ఆత్మహత్య ..!
By: Tupaki Desk | 20 Nov 2019 9:27 AM GMTఆత్మహత్య .. ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తున్న పేరు. ఎవరు ఎప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో ఎవరికీ తెలియడంలేదు. అసలు దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని..తెలిసి తెలిసి తమ చేతులారా ఎందుకు నాశనం చేసుకుంటున్నారో మరి. ఏ సమస్య కైనా ఒక సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. కానీ , సమస్య వచ్చిందని ఆత్మహత్యకి పాల్పడితే ..ఈ ప్రపంచంలో అసలు మనుషులు అనే వారే మిగలరు. ఈ మధ్య ఆత్మహత్య అనేది ఒక ఫ్యాషన్ గా మారింది. లవ్ లో ఫెయిల్ అయ్యామని ఒకరు - పరీక్షలో ఫెయిల్ అయ్యామని ఇంకొకరు.. ఉద్యోగం రాలేదని కొందరు ..ఉద్యోగం పోయిందని కొందరు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు.
తాజాగా హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మాదాపూర్ లోని గోల్డెన్ హిల్స్ క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లి. కంపెనీలో పనిచేస్తున్న ఓ సాఫ్ట్ వేర్ యువతి గచ్చిబౌలిలోని లేడీస్ హాస్టల్ లో ఉంటుంది. అయితే బుధవారం ఆఫీసుకు వెళ్లని ఆ యువతి హాస్టల్లోని ఫ్యానుకు ఉరివేసుకుంది. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఆ యువతి పేరు పొగాకు హరిణిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆత్మహత్య చేసుకున్న ఆ యువతి సాఫ్ట్ వేర్ కంపెనీలో రెండున్నర ఏళ్లుగా పని చేస్తుంది. ఆమె పనిచేస్తున్న సంస్థ ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ తో ఆమె గడువు ముగియనున్నట్లు తెలిసింది. అయితే ఈ కారణంగా ఆమె ఉద్యోగం కోల్పోతాననే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఉద్యోగం కోసం అలోచించి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకొని ..ఆమె తల్లిదండ్రులని తీరని శోకంలో ముంచేసింది.