Begin typing your search above and press return to search.
లగడపాటి క్లారిటీ!... ఈ సారి పోటీ లేదబ్బా!
By: Tupaki Desk | 22 Feb 2019 5:09 PM GMTలగడపాటి రాజగోపాల్... కాలు బయటపెట్టారంటే చాలు లెక్కలేనన్ని వార్తలు. అన్నీ పుకార్లే. ఏ ఒక్కటీ నిజం కాలేదు. రాజకీయ నేతగా మంచి ముద్రే వేసుకున్న లగడపాటి సర్వేలు చేసి ఆంధ్రా ఆక్టోపస్‌గానూ మంచి మార్కులే వేసుకున్నారు. అయితే ఈ ఇమేజీని మొత్తంగా మొత్తం ఒక్క దెబ్బకు మటాష్ అయిపోయిందనే చెప్పాలి. మొన్నటి తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సర్వే ద్వారా ఒక్క దెబ్బతో తనపై ఉన్న మంచి ఇమేజీని లగడపాటి చేజేతులారా పోగొట్టుకున్నారు. తెలుగు నేల విభజనకు నిరసనగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన లగడపాటి... ఐదేళ్లు తిరగకముందే... మనసు మార్చేసున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఈ దిశగా ఆలోచిస్తున్నానని, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉంటానని తేల్చేశారు. అయితే ఏమైందో తెలియదు గానీ.. మళ్లీ ఆయన మాట మార్చేశారు. ఈ దఫా ఎన్నికల్లో తాను పోటీకి దిగేది లేదని తాజా ప్రకటించారు. మొత్తంగా లగడపాటి ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న కోణంలో సాగుతున్న విశ్లేషణలకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారని చెప్పక తప్పదు.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా తన ఫ్లాష్ టీం ద్వారా చేయించిన సర్వే అంటూ లగడపాటి విడుదల చేసిన సర్వే... పూర్తిగా మ్యానిపులేటెడ్ సర్వేనని తేలిపోయింది. ప్రజా ప్రతిస్పందన ఒక రకంగా ఉంటే... లగడపాటి సర్వే అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉండటమే ఈ ఆరోపణలకు ఆస్కారం ఇచ్చిందని చెప్పాలి. అంతేకాకుండా పోలింగ్ ముగిసిన తర్వాత సర్వేలను విడుదల చేసే లగడపాటి... టీడీపీ, కాంగ్రెస్ కూటమికి మేలు చేసేందుకే ఏకంగా తన నిబంధనలను తానే పక్కనపెట్టేసుకుని పోలింగ్‌కు ఓ రోజు ముందుగా మహా కూటమి గెలిచేస్తోందని సర్వేను విడుదల చేశారు. ఆ తర్వాత ఆయనపై టీఆర్ఎస్ విరుచుకుపడింది. ఏకంగా ఆయన విశ్వసనీయత ఎంత అన్న విషయాన్ని చెప్పేందుకు ఏకంగా కేటీఆర్ తన వాట్పాప్‌కు లగడపాటి పంపిన మెసేజ్‌లను విడుదల చేశారు. మొత్తంగా ఈ ఒక్క దెబ్బకు లగడపాటి ఇమేజీ మొత్తం డ్యామేజీ అయిపోయింది.
ఈ క్రమంలోనే పలుమార్లు మీడియా ముందుకు వచ్చిన లగడపాటి.... రాజకీయ సన్యాసాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. పార్లమెంటు బరిలో దిగుతానని. ఏపీ అసెంబ్లీ బరిలో మాత్రం దిగనని కూడా ఆయన ప్రకటించారు. పార్లమెంటు బరి కూడా తెలంగాణ నుంచే ఉంటుందని, ఏపీ నుంచి కాదని కూడా తేల్చేశారు. అయితే తాను ఇచ్చిన నకిలీ సర్వే పని చేయకపోగా... తన వ్యక్తిత్వంపైనే మచ్చ పడిపోయిందన్న వాదన వినిపించింది. లగడపాటి ఇచ్చిన సర్వేకు పూర్తి విరుద్ధమైన ఫలితాలు వచ్చేశాయి. ఈ క్రమంలో తాను తెలంగాణలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఫలితం చాలా దారుణంగా ఉంటుందనుకున్నారో, ఏమో తెలియదు గానీ... నేడు లగడపాటి నుంచి ఓ ఆసక్తికర ప్రకటన వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో తాను అసలు పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించేశారు. అక్కడ లేదు, ఇక్కడ లేదు... ఎక్కడి నుంచి కూడా తాను పోటీకి దిగేది లేదని ఆయన చాలా క్లియర్‌గానే ప్రకటించేశారు.