Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పాల‌న అలా.. ప‌వ‌న్ తీరు ఇలా.. ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   10 March 2021 10:30 AM GMT
జ‌గ‌న్ పాల‌న అలా.. ప‌వ‌న్ తీరు ఇలా.. ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X
మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చాలా కాలం త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. ఏపీలో జ‌రుగుతున్న మునిసిల్ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓటేశారు. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. రాష్ట్ర‌ రాజ‌కీయాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

వైఎస్ జ‌గ‌న్ పాల‌న ఎలా ఉందో తెలియాలంటే క‌నీసం మూడేళ్లు పూర్త‌వ్వాల‌న్నారు. అప్పుడే ఒక అంచ‌నాకు రాగ‌ల‌మ‌ని అన్నారు. అయితే.. అభివృద్ధి, సంక్షేమం విష‌యంలో ప్ర‌భుత్వాలు స‌మ‌తూకం పాటించాల్సి ఉంటుంద‌న్నారు. వైఎస్ హ‌యాంలో ఇవి రెండూ స‌మంగా ఉన్నాయ‌ని చెప్పారు.

ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి కూడా రాజ‌గోపాల్ మాట్లాడారు. ప‌వ‌న్ ప‌నితీరుపై కితాబిచ్చారు. ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్, ఆయ‌న పార్టీ ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం అభినంద‌నీయం అన్నారు ల‌గ‌డ‌పాటి. ఇక‌, తానూ చెప్పిన మాట ప్ర‌కారం.. రాజ‌కీయాల‌కు దూరంగానే ఉన్నాన‌ని, సామాన్యుడిగానే ప‌రిశీలిస్తున్నాన‌ని చెప్పారు.

ఇక‌, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై ప్ర‌భుత్వ అజ‌మాయి ఉండ‌కూడ‌ద‌ని బీజేపీ నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి చేసిన వ్యాఖ్య‌ల‌పైనా ల‌గ‌డ‌పాటి స్పందించారు. వేల కోట్ల రూపాయ‌ల ఆస్తులున్న టీటీడీ ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో ఉంటే ఎన్నో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతాయ‌ని, ప్ర‌భుత్వం చేతిలో ఉంది కాబ‌ట్టే ఎవ‌రూ వేలెత్తి చూప‌డం లేద‌న్నారు. దేశంలో ఉత్త‌రాదిలో ఆల‌యాలు స్వ‌తంత్రంగా ఉంటాయ‌ని, ద‌క్షిణాదిలో ప్ర‌భుత్వాల ప‌రిధిలో ఉంటాయ‌న్నారు. అయితే.. ఏది స‌రైంద‌న్న విష‌యాన్ని తాను చెప్ప‌లేన‌ని, కోర్టులు త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని అన్నారు ల‌గ‌డ‌పాటి.