Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటి సొంత బ్ర‌ద‌ర్ ఎగ్జిట్ పోల్ గురించి విన్నారా?

By:  Tupaki Desk   |   20 May 2019 6:18 AM GMT
ల‌గ‌డ‌పాటి సొంత బ్ర‌ద‌ర్ ఎగ్జిట్ పోల్ గురించి విన్నారా?
X
త‌న ఎగ్జిట్ పోల్స్ తో తెలుగు మీడియా మొత్తాన్ని ఆక‌ర్షించిన ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా చంద్ర‌బాబు మ‌రోసారి అధికారాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్లుగా చెప్ప‌టం తెలిసిందే. జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మ‌ని.. బాబు గెలుపు త‌ప్ప‌ద‌ని చెప్పారు. రెండోసారి అధికారం ప‌క్కా అంటూ ల‌గ‌డ‌పాటి వ్యాఖ్య‌ల‌కు భిన్నంగా ఆయ‌న సొంత బ్ర‌ద‌ర్ స‌ర్వే ఫ‌లితాలు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

తాను చెప్పిన స‌ర్వే ఫ‌లితం త‌ప్పు అయితే.. తానిక ఎప్ప‌టికీ స‌ర్వే ఫ‌లితాల్ని వెల్ల‌డించ‌నంటూ ల‌గ‌డ‌పాటి శ‌ప‌ధం చేయ‌టం తెలిసిందే. తాజా ఎన్నిక‌ల్లో టీడీపీకి 100 స్థానాలు ఖాయంగా వ‌స్తాయ‌ని.. వైఎస్సార్ కాంగ్రెస్ కు గ‌రిష్ఠంగా 72 సీట్ల‌కు మించి రావ‌ని తేల్చేశారు. మొత్తం 175 స్థానాలున్న ఏపీలో 88 స్థానాలు మేజిక్ ఫిగ‌ర్ అన్న విష‌యం తెలిసిందే. ల‌గ‌డ‌పాటి అంచ‌నాల‌కు భిన్నంగా ఆయ‌న సొంత సోద‌రుడు చెబుతున్న స‌ర్వే రిపోర్ట్ విష‌యాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ల్యాంకో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన ల‌గ‌డ‌పాటి మ‌ధుసూద‌న్ తాజాగా ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏ తీరులో ఉండ‌నున్నాయ‌న్న విష‌యాన్ని చెప్పారు. జిల్లాల వారీగా ఆయ‌న వెల్ల‌డించిన ఫ‌లితాలు ఇలా ఉన్నాయి. ఆయ‌న అంచ‌నా ప్ర‌కారం వైఎస్సార్ కాంగ్రెస్ కు 106 స్థానాలు ప‌క్కాగా వస్తాయ‌ని.. టీడీపీ 68 సీట్లు.. జ‌న‌సేన‌కు ఒక్క సీటు మాత్ర‌మే వ‌స్తుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఎంపీ సీట్ల విష‌యానికి వ‌స్తే.. మ‌ధుసూద‌న్ అంచ‌నా ప్ర‌కారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు 18 నుంచి 21 వ‌ర‌కు వ‌చ్చే వీలుంద‌ని.. బాబుకు నాలుగు నుంచి ఆరు వ‌ర‌కు అవ‌కాశం ఉందంటున్నారు.

మ‌ధుసూద‌ర్ లెక్క ప్ర‌కారం ఆయ‌న చేయించిన స‌ర్వే ప్ర‌కారం.. ఏపీలో జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో చెప్పారు.

జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ టీడీపీ జ‌న‌సేన‌

శ్రీ‌కాకుళం 5 5 -

విజ‌య‌న‌గ‌రం 5 4 -

విశాఖ‌ప‌ట్నం 7 7 1

తూర్పు గోదావ‌రి 10 9

ప‌శ్చిమ‌గోదావ‌రి 8 7

కృష్ణా 11 5

గుంటూరు 8 9

ప్ర‌కాశం 7 5

నెల్లూరు 8 2

చిత్తూరు 10 4

క‌డ‌ప 9 1

అనంత‌పురం 6 8

క‌ర్నూలు 12 2