Begin typing your search above and press return to search.
లెక్క తప్పింది... లగడపాటి సర్వేల జోలికెళ్లరట!
By: Tupaki Desk | 24 May 2019 1:24 PM GMTఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడట. ఈ సామెత ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విషయంలో అచ్చుగుద్దినట్టు సరిపోతుందేమో. నిజమే మరి.... వాపును బలుపు అనుకున్నారో, లేదంటే వాపును బలుపుగా మార్చి చూపితే సరిపోతుందనుకున్నారో... తెలియదు గానీ... లగడపాటి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యలా మారింది. తెలుగు నేల విభజనకు నిరసనగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన లగడపాటి... రాజకీయాలు మరిగిన నేపథ్యంలో ఇంటిపట్టునే సైలెంట్ గా కూర్చోవడమో, తనకున్న వ్యాపారాలను మరింతగా విస్తరించుకునే పనినో చేపట్టలేకపోయారు.
సర్వేలంటూ లైమ్ లైట్ లోకి వచ్చేశారు. పాలిటిక్స్ లోకి రాకముందు నుంచే సర్వేలు చేస్తున్నానని లగడపాటి చెప్పుకుంటున్నా... గడచిన 10-15 ఏళ్లలోనే ఆయన సర్వేలు జనానికి పరిచయమయ్యాయి. తెలుగు ప్రజల నాడితో పాటు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా... తన ఆర్జీ ఫ్లాష్ టీంను రంగంలోకి దించేసిన లగడపాటి సర్వేలు చేయిస్తూ వచ్చారు. చాలా చోట్ల లగడపాటి జోస్యాలు నిజమయ్యాయి కూడా. అయితే మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే మాస్టర్ పాత్రకు కాస్తంత పొలిటీషియన్ కలరింగ్ ను కలిపేసి... ఓ వర్గానికే కొమ్ము కాసే యత్నం చేశారు. అయితే జనం ఆ తరహా యత్నాన్ని తిప్పికొట్టారు. ఇంకేముంది... లగడపాటి జోస్యం తిరగబడింది. దెబ్బకు నెలల పాటు అడ్రెస్ లేకుండా పోయిన లగడపాటి... తిరిగి ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్నాయనగా మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో వరుస భేటీలు నిర్వహిస్తూ.... టీడీపీ నేతగానే కనిపించారు. ఈ క్రమంలో ఆయన చేసిన సర్వేను జనం టీడీపీ సర్వేగానే భావించారు.
అయితే తన సర్వే నిజమేనని నమ్మించేందుకు లగడపాటి చేయని యత్నమంటూ లేదనే చెప్పాలి., ఈ క్రమంలోనే ఈ సారి తన లెక్క తప్పితే... ఇకపై సర్వేలు చేయరని ఒట్టేశారు. ఈ ఓట్టు తనను ఎంతగా ఇబ్బంది పెడుతుందన్న అంశాన్ని ఆయన అంతగా ఆలోచించినట్టు లేరు. సరే... ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. లగడపాటి జోస్యం మొత్తానికి మొత్తమే తిరగబడిపోయింది. ఆ వెంటనే లగడపాటి ఎక్కడ? బొక్కలేసి కుమ్మేయాలంటూ నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు సంధించారు. ఈ నేపథ్యంలో నిన్న అడ్రెస్ లేకుండాపోయిన లగడపాటి... నేడు కూడా మీడియాకు ముఖం చాటేశారు. తన జోస్యం తిరగబడటంతో ముఖం చెల్లని లగడపాటి.... ఓ పత్రికా ప్రకటనను మాత్రం విడుదల చేశారు. అందులో తన తప్పును ఒప్పేసుకోవడంతో పాటుగా ఏపీ ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా చేసిన పెట్టుకున్న ఒట్టు మేరకు ఇకపై సర్వేలు చేయబోనని ఆయన సంచలన ప్రకటన చేశారు. అంటే లగడపాటి సర్వేలు ఇకపై కనిపించవన్న మాట.