Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ ఎంపీ విందుకు హాజరైన లగడపాటి
By: Tupaki Desk | 7 July 2016 6:05 PM GMTలగడపాటి రాజగోపాల్... తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి గురించి కూడా కొత్తగా చెప్పక్కర్లేదు. కేసీఆర్ సారథ్యంలోని ఈ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశరాజకీయాల్లోనూ టీఆర్ఎస్‌ది చెరగని ముద్ర. రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్న లగడపాటికి - టీఆర్ ఎస్ కు మధ్య జరిగిన పోరాటం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇపుడు లగడపాటి - టీఆర్ ఎస్ ల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఏకంగా టీఆర్ ఎస్ ముఖ్య నేత ఇచ్చిన విందుకు లగడపాటి హాజరయ్యే స్థాయికి చేరింది మరి.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం టీఆర్ ఎస్ నుంచి ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా డి శ్రీనివాస్ ఎంపికయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపీకయిన సందర్భంగా వింధు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు లగడపాటి రాజగోపాల్ హాజరయినట్లు సమాచారం. పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు - ఢిల్లీలోని ప్రముఖులు సైతం హాజరయ్యారు అయితే ఈ పరిణామం గురించి తెలిసిన వారు ఆశ్చర్యపోవడం లేదు. లగడపాటి-డీఎస్ ల మధ్య సంబంధాలు పాత చరిత్రేనని అంటున్నారు. నిజామాబాద్ లో డీఎస్ షష్టిపూర్తికి కూడా లగడపాటి వచ్చారని చెప్తున్నారు.
అయితే షష్టిపూర్తి సమయంలో డీఎస్ కాంగ్రెస్ లో ఉండేవారు. ప్రస్తుతం టీఆర్ ఎస్ ముఖ్య నాయకుడిగా ఉండటమే కాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్న నేపథ్యంలో ఈ కలయిక ఆసక్తికరంగా మారింది. ఈ విందుతో కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.