Begin typing your search above and press return to search.
జగన్ తో తనకున్న రిలేషన్ చెప్పిన లగడపాటి
By: Tupaki Desk | 20 May 2019 5:15 AM GMTఎగ్జిట్ పోల్స్ తో ఒక మాజీ రాజకీయ నాయకుడు భారీ ఇమేజ్ ను సొంతం చేసుకోవటం ఒక్క లగడపాటికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ చెప్పే పేరుతో గడిచిన రెండు రోజుల్లో మీడియాలో ప్రముఖంగా కనిపించిన లగడపాటి.. శనివారం సాయంత్రం చెప్పిన మాటల్నే ఆదివారం సాయంత్రం చెప్పారని చెప్పాలి. కాకుంటే.. మరింత వివరంగా చెప్పేశారు. ఏపీలో బాబు గెలుపు ఖాయమన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది.
మెజార్టీ మీడియా సంస్థలు.. సర్వే సంస్థల అంచనాలకు భిన్నంగా లగడపాటి సర్వే ఉండటం గమనార్హం. ప్రెస్ మీట్ లో భాగంగా తన సర్వే లెక్కలతో పాటు.. మరిన్ని ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ తాము చేసిన సర్వేల్లో తెలంగాణ విషయంలో మినహాయిస్తే.. మరెక్కడా తాము ఫెయిల్ కాలేదన్నారు. తెలంగాణలో ఎందుకు ఫెయిల్ అయ్యామన్న విషయాన్ని తర్వాతి రోజుల్లో చెబుతామని చెప్పిన లగడపాటి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకున్న బంధాన్నిచెప్పుకొచ్చారు.
తనకు చంద్రబాబు.. జగన్.. పవన్ అందరూ తెలుసన్నారు. జగన్ తనకు బాగా దగ్గరన్న లగడపాటి.. రాజకీయ అనుబంధం వేరు.. వ్యక్తిగత అనుబంధం వేరన్నారు. వైఎస్ కుటుంబంతో తనకున్న అనుబంధం ఎక్కువని చెప్పారు. అయితే.. అదంతా పర్సనల్ అని తేల్చేశారు.
తాను ఏ పార్టీలో చేరే ఆలోచన లేదన్న ఆయన.. తాము వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఎమ్మెల్యేలపై అనుకూలత.. ప్రతికూలతతో పాటు.. అధికార.. ప్రతిపక్షాల పనితీరు.. వారి పోరాటాలు.. ప్రజల ఆలోచనల్ని లోతుగా అధ్యయనం చేసిన వచ్చిన అంచనానే తాము చెబుతున్నట్లు పేర్కొన్నారు. తాను చెప్పేది నిజమా? అబద్ధమా అన్నది ఈ నెల 23 తర్వాత తేలిపోతుందన్న ఆయన.. జగన్ తో తనకు సరైన సంబంధాలు లేవనే ప్రచారం సరికాదనే మాటను చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.