Begin typing your search above and press return to search.

లగ‌డ‌పాటి మాట‌!..అధికారం జ‌గ‌న్‌ దే!

By:  Tupaki Desk   |   2 Feb 2018 8:38 AM GMT
లగ‌డ‌పాటి మాట‌!..అధికారం జ‌గ‌న్‌ దే!
X
ఏపీలో ఇప్పుడు స‌రికొత్త రాజ‌కీయం న‌డుస్తోంద‌న్న మాట వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది మాత్ర‌మే స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే రాజ‌కీయ వేడి రాజుకుందనే చెప్పాలి. వ‌చ్చే ఎన్నికల్లో అధికార‌మే ల‌క్ష్యంగా విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాద‌యాత్ర‌ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఆరు నెల‌ల పాటు 3 వేల కిలో మీట‌ర్ల మేర సాగ‌నున్న ఈ యాత్ర ప్ర‌స్తుత నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతోంది. ఇటీవ‌లే వెయ్యి కిలో మీట‌ర్ల యాత్ర‌ను పూర్తి చేసిన జ‌గ‌న్‌... మ‌రో రెండు వేల కిలో మీట‌ర్ల మేర పాద‌యాత్ర చేసి శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో యాత్ర‌ను ముగించ‌నున్నారు. ఈ లోగా ఎన్నిక‌లు మ‌రింతగా స‌మీపించ‌నున్నాయి. అశేష జ‌నాద‌ర‌ణ క‌లిగిన నేత‌గా జ‌గ‌న్‌కు ఇప్ప‌టికే క్రౌడ్ పుల్ల‌ర్‌గా మంచి పేరు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ కార‌ణంగా జ‌గ‌న్ యాత్ర‌కు ఇసుకేస్తే రాల‌నంత మంది త‌ర‌లి వ‌చ్చేస్తున్నారు. అదే స‌మ‌యంలో గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో మాదిరి జ‌ర‌గ‌కుండా ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌... ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఆల‌కిస్తూనే... వాటికి ఏ త‌ర‌హా ప‌రిష్కార మార్గాలు చూపితే బాగుండేద‌న్న విష‌యాన్ని చెబుతూ... తాను అధికారంలోకి వస్తే వాటిని ఎలా ప‌రిష్క‌రిస్తాను? అన్న విష‌యాల‌ను చాలా విస్ప‌ష్టంగా చెబుతూ ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఏపీలో కొన‌సాగుతున్న చంద్ర‌బాబు పాల‌న‌పై నిప్పులు చెరుగుతూ త‌న‌దైన ప‌వ‌ర్ పంచ్ డైలాగులు విసురుతూ టీడీపీ అండ్ కోకు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తున్నార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

ఇక గ‌డచిన ఎన్నిక‌ల్లో అమ‌లు సాధ్యం కాని హామీలను గుప్పించిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్లుగా... జ‌న‌సేన పేరిట ప్ర‌త్యేక రాజ‌కీయ వేదిక‌ను ఏర్పాటు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌రా తీసుకుని గ‌ద్దెనెక్కారు. అయితే ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో చాలా హామీలు ఇప్ప‌టికీ నెర‌వేరిన దాఖ‌లా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో బాబు పాల‌న‌పై నానాటికీ ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పెరిగిపోతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తానికి ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే... చంద్ర‌బాబు చాప చుట్టేసుకుని ఇంటికి వెళ్ల‌డం ఖాయ‌మేన‌ట‌. అంతేకాకుండా పాద‌యాత్ర‌తో జ‌నం మ‌దిలో మ‌రింత‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బంప‌ర్ మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చేస్తార‌ట‌. ఇక ఏపీ రాజ‌కీయాల్లో తానో తురుపు ముక్క‌గా మార‌తాన‌ని భావిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆట‌లో అర‌టిపండు మాదిరిగానే మారిపోవ‌డం మిన‌హా పెద్ద‌గా ప్ర‌భావితం చేసే అవ‌కాశాలు లేవ‌ట‌. అయితే ప్ర‌జారాజ్యం పార్టీ పేరిట త‌న సోద‌రుడు మెగాస్టార్ చిరంజీవి పార్టీని పెట్టి సంపాదించిన 18 సీట్ల కంటే... ప‌వ‌న్ కేవ‌లం ఓ సీటు అధికంగా 19 సీట్ల‌ను గెలుస్తార‌ట‌. అయితే మొత్తం 175 సీట్ల‌లో ప‌వన్ విజ‌యం సాధించినా... ఆ సీట్లు గానీ, టీడీపీకి ద‌క్కిన స్థానాల‌తో ఏమాత్రం సంబంధం లేకుండానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ జ‌గ‌న్ సాధిస్తార‌ట‌.

అంటే... విప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ అధికార పీఠం ఎక్కితే... ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు విప‌క్ష స్థానంలోకి, చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిల‌బడ్డ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో చిన్న విప‌క్షంగా మిగిలిపోతార‌ట‌. అయితే గియితే... ప‌వ‌న్ పోటీలో లేకుంటే ఆయ‌న పార్టీకి వ‌చ్చే స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డిపోతాయ‌ట‌. ఇదేదో కాకి లెక్క‌లు చెప్పే స‌ర్వే ఎంత‌మాత్రం కాదు. ఎందుకంటే... తెలుగు నేల‌తో పాటు దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా... ప‌క్కా అంచ‌నాను చెబుతార‌ని పేరున్న బెజ‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స్వ‌యంగా చేయించిన స‌ర్వే చెబుతున్న‌ మాటే ఇదన్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ల‌గ‌డ‌పాటి స‌ర్వే పేరిట సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఈ స‌ర్వే ఏపీ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది. గ‌త అక్టోబర్‌లోనూ ల‌గ‌డ‌పాటి స‌ర్వే చేయించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌ర్వేలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో ఓ 35 మంది మ‌ళ్లీ గెలిచే ఛాన్సే లేద‌ని ల‌గ‌డ‌పాటి నేరుగా చంద్ర‌బాబుకే చెప్పేశార‌ట‌. తాజాగా చేయించిన స‌ర్వేలో మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌రంగా టీడీపీ విజ‌యావ‌కాశాలు మ‌రింత‌గా దిగజారిపోయి... 52 సీట్ల‌కే ప‌రిమితం అవుతుంద‌ట‌. అంటే ఇప్పుడున్న సీట్ల‌లో స‌గానికి పైగా సీట్లు టీడీపీ ఖాతా నుంచి ఇత‌ర పార్టీల ఖాతాల్లోకి వెళ్ల‌నున్నాయ‌న్న మాట‌. నానాటికీ జ‌నంలో చంద్ర‌బాబు స‌ర్కారుపై పెరుగుతున్న అసంతృప్తి ఫ‌లితంగానే ఈ త‌ర‌హా రిజ‌ల్ట్స్ వ‌స్తాయ‌న్న‌ది ల‌గ‌డ‌పాటి స‌ర్వే మాట‌గా వినిపిస్తోంది. ఇక ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలోని వైసీపీకి ఏకంగా 105 సీట్లు వ‌స్తాయ‌ట‌. అంటే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీకి వ‌చ్చిన 103 సీట్ల కంటే మ‌రో రెండు అదికంగా జ‌గ‌న్ సాదించ‌నున్నార‌న్న మాట‌.