Begin typing your search above and press return to search.

క‌విత‌తో ల‌గ‌డ‌పాటి భేటీ అయ్యారే!

By:  Tupaki Desk   |   3 Nov 2017 11:49 AM GMT
క‌విత‌తో ల‌గ‌డ‌పాటి భేటీ అయ్యారే!
X
ఆంధ్రా ఆక్టోప‌స్‌ గా పేరొందిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కొంత‌కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. అయితే రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నా.. ఎన్నిక‌లు జ‌రిగితే గెలిచేదెవ‌రో ఆయ‌న చేప‌ట్టే స‌ర్వేల‌తో వెల్ల‌డిస్తుంటారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వేల‌తో.. వెల్ల‌డ‌య్యే ఫ‌లితాలు స‌రిగ్గా స‌రిపోతుంటాయి. దీంతో ఆయ‌న ఏం చెబుతారోన‌ని రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల వేళ ఎదురు చూస్తుంటాయి. అలాంటి రాజ‌గోపాల్ తెలంగాణ జాగ‌ృతి నాయ‌కురాలు - నిజామాబాద్ ఎంపీ క‌విత‌తో స‌మావేశం కావ‌డం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది.

కొంత‌కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న రాజ‌గోపాల్ ఇటీవ‌ల వ‌రుస‌గా రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను క‌లుస్తున్నారు. త‌న కుమారుడి వివాహానికి హాజ‌రుకావాల‌ని ఆహ్వానించేందుకే ఆయ‌న ప‌లువురితో భేటీ అవుతున్నారు. తాజాగా క‌విత‌తో స‌మావేశం కూడా అందులో భాగంగానే జ‌రిగింది. ఈ నెల‌లో హైద‌రాబాద్‌ లో జ‌ర‌గనున్న క‌విత‌ను ఆహ్వానించేందుకు రాజ‌గోపాల్ హైటెక్ సిటీలోని ఆమె ఇంటికి వెళ్లారు. త‌ప్ప‌నిస‌రిగా వివాహానికి రావాల‌ని కోరారు. రాజ‌గోపాల్ ఆహ్వానానికి క‌విత కూడా సానుకూలంగా స్పందించారు.

ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఇటీవ‌ల కాంగ్రెస్‌ లో చేరిన టీటీడీపీ ఫైర్‌ బ్రాండ్ రేవంత్ వ్య‌వ‌హారం.. త్వ‌ర‌లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ చేప‌ట్ట‌నున్న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌పై ఇరువురు నేతలు చ‌ర్చించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో చంద్ర‌బాబునాయుడు నేత‌ృత్వంలోని తెలుగుదేశం ప్ర‌భుత్వం ప‌నితీరుపైనా క‌విత‌ - రాజ‌గోపాల్ మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.