Begin typing your search above and press return to search.
జగన్ ఏపీ సీఎం : లగడపాటి సర్వే ?
By: Tupaki Desk | 21 Nov 2018 8:58 AM GMTఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. అవును ఈ మాటలన్నది ఎవరో కాదు... తన సర్వేలతో తెలుగు వారిని ఆశ్చర్యపరిచే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అట. ఎన్నికల ముందు ప్రతీసారి లగడపాటి రాజగోపాల్ సర్వేలు చేయిస్తారు. తన సొంత సర్వేలకు తెలుగు ప్రజలల్లోనే కాదు... జాతీయ స్ధాయిలో కూడా ఆయనకు విశ్వసనీయత ఉంది. 2014 సంవత్సరంలో లగడపాటి చేయించిన సర్వే ఫలితాలు ఎన్నికల్లో వాస్తవాలయ్యాయి. ఈసారి ఏడాది ముందుగానే లగడపాటి సర్వే చేయించారట కానీ అఫిషియల్ గా విడుద చేయలేదని, ఆసర్వే ఫలితాలు ఇవే అని ఒక వార్త వైరల్ అవుతోంది.
అనఫిషియల్ సర్వేగా వైరల్ అవుతున్న ఈ సర్వేలో వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని లగడపాటి తన సర్వేలో తేలినట్లు చెబతున్నారు. 2014 సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఎన్నికల్లో భారీ మార్పులుంటాయని తన సర్వేలో తేలిందట. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి ఓటమి తప్పదని, ఈసారి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుందని పేర్కోన్నారట అందులో.
ఇంకా అందులో ఉన్న విషయాలేంటంటే... లగడపాటి సర్వే ప్రకారం పవన్ కల్యాణ్ పెట్టిన కొత్త పార్టీ జనసేన ప్రభావం తెలుగుదేశం పార్టీ పై ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన కారణంగా తెలుగుదేశం పార్టీ భారీ కుదుపులు ఎదుర్కొంటుందట. మరోవైపు జగన్మోహనర్ రెడ్డి కి రాను రాను ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని సర్వేలో తేల్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రకటించిన నవరత్నాలు, మేనిఫోస్టోలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని సర్వేలో పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సర్వేలో స్పష్టం అయ్యిందట.
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజకీయంగా తెర వెనుకకు వెళ్లిన లగడపాటి తన ఎన్నికల సర్వేలకు మాత్రం విరామం ఇవ్వలేదు. ఆయన ఇటీవల మాట్లాడుతూ తాను రాజకీయాల్లో కి వస్తు్నట్లు చెప్పారు. అలాగే సర్వేల గురించి మాట్లాడుతూ నేను అధికారికంగా ప్రకటించిందే నా సర్వే అని, ఇంకా నేను ప్రకటించలేని చెప్పారు. తెలంగాణ పై సర్వే ఫలితాలు పోలింగ్ తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. మరి ఈ సర్వే లీకా? ఫేకా? అన్నది తేలాల్సి ఉంది.