Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటి వ‌స్తున్నాడు... !

By:  Tupaki Desk   |   31 Oct 2018 2:21 PM GMT
ల‌గ‌డ‌పాటి వ‌స్తున్నాడు... !
X
ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియ‌ని వారు అరుదు. మోస్ట్ యాక్టివ్ పొలిటీషియ‌న్‌. అయితే రాష్ట్ర విభ‌జ‌న వివాదం నేప‌థ్యంలో విభ‌జన జ‌రిగితే రాజ‌కీయాల నుంచి తప్పుకుంటాన‌ని ఆయ‌న ప్రామిస్ చేశారు. నిజంగానే ఏపీని విభ‌జించ‌డంతో రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారు. త‌న వ్యాపార వ్య‌వ‌హారాల్లో ఆయ‌న మునిగిపోయారు. అయితే, ఆయ‌న బాగా పాపుల‌ర్ అయిన స‌ర్వేల విష‌యంలో మాత్రం యాక్టివ్‌ గానే ఉన్నారు. తాజాగా ఈరోజు ఆయ‌న రాజ‌కీయ ప్ర‌క‌ట‌న చేశారు.

తాను మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్పారు. అవకాశం వ‌స్తే తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తానని వెల్ల‌డించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచ‌న లేద‌న్నారు. పార్లమెంటుకు అవకాశం వస్తే పోటీ చేస్తానని తెలిపారు. ఇక స‌ర్వేల గురించి కూడా ఆయ‌న చెప్పారు. డిసెంబర్‌ 7 తరువాతే తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్ల‌డిస్తాం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌- టీడీపీ పొత్తు... సక్సెస్‌ అవుతుందా లేదా అనేది ప్రజలే చెప్పాలని అన్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం మాత్ర‌మే ప్ర‌జ‌ల నాడి డిసైడ్ అవుతుంద‌న్నారు. ఆ త‌ర్వాతే దాని జ‌యాప‌జ‌యాల గురించి మాట్లాడ‌టం సాధ్యం అన్నారు. పార్టీలు కోరితే ముందే సర్వే చేసి చెబుతానని లగడపాటి చెప్ప‌డం విశేషం. టీడీపీ - కాంగ్రెస్‌ లు ఏ రాష్ట్రంలోనూ ప్రత్యర్థులు కారని వ్యాఖ్యానించారు. విభ‌జ‌న‌కు తెలంగాణలో విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త ఎదుర్కొన్న ల‌గ‌డపాటి తెలంగాణ నుంచి పోటీ చేస్తాన‌ని చెప్ప‌డం ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం.

జ‌గ‌న్ దాడిపై ల‌గ‌డ‌పాటి స్పంద‌న‌...

చంద్ర‌బాబుకు మాన‌వ‌త్వం లేద‌ని ఇప్ప‌టికే ప‌లుసార్లు బాబు వ్య‌వహారంతో స్ప‌ష్ట‌మైంది. ప్ర‌తి ఒక్కరూ జ‌గ‌న్‌ పై జ‌రిగిన దాడిని త‌ప్పు ప‌ట్టారు. చంద్ర‌బాబు మాత్రం ఎగ‌తాళి చేశారు. తాజాగా అనేక విష‌యాల‌పై స్పందించిన ల‌గ‌డ‌పాటి కూడా జ‌గ‌న్‌ పై దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి ఎవ‌రిపై జ‌రిగినా త‌ప్పేన‌ని... అలాంటి ఒక ప్ర‌తిప‌క్ష నేత‌పై జ‌ర‌గ‌డం తీవ్ర ఖండ‌నీయ‌మన్నారు. అయితే, త‌న స్పంద‌న‌పై జనాల వ్య‌తిరేక‌త బాబుకు కూడా అర్థ‌మైంది. అందుకే నిన్న‌టి స‌భ‌లో ఒక వ్యాఖ్య చేశారు. ఆరోజు క్రికెట‌ర్లు ఉండ‌టం వ‌ల్ల రాష్ట్రం ప‌రువు పోతుంద‌ని కోపం వ‌చ్చింద‌ని... జ‌గ‌న్ పై దాడి గురించి తాను వేరేలా స్పందిద్దామ‌ని అనుకున్నాన‌ని చంద్ర‌బాబు నిస్సిగ్గుగా చెప్పారు.