Begin typing your search above and press return to search.

టీడీపీలో లగడపాటి రోల్ ఇదేనట

By:  Tupaki Desk   |   12 May 2019 11:39 AM GMT
టీడీపీలో లగడపాటి రోల్ ఇదేనట
X
లోటు బడ్జెట్‌ లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగే శక్తి ఒక్క చంద్రబాబుకే ఉన్నదన్న నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికల్లో ప్రజలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని ఆయన కూడా బాగానే నిలబెట్టుకున్నారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా.. ప్రతిపక్షాలు ఏకమై ముప్పేట దాడి చేస్తున్నా.. ఏమాత్రం బెదరకుండా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపించారు. ఏడు పదుల వయసులో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రతిపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా ఇక ఎన్నికలకు సన్నద్ధమయ్యే క్రమంలో ఆయన సరికొత్త పంథాను ఫాలో అయ్యారు.

గతంలో తన సొంత నిర్ణయాలు.. వ్యూహాలతో ఎన్నికల బరిలో దిగిన చంద్రబాబు.. ఈ సారి మాత్రం పలువురి సలహాలు తీసుకున్నారని తెలిసింది. ముఖ్యంగా విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నుంచి పలు సూచనలు స్వీకరించారని సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చంద్రబాబు.. రాజకీయాలు చేయడంలో దిట్ట. ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే అది కొన్ని సందర్భాల్లో తప్ప చాలా సార్లు సక్సెస్ అయింది. అందుకే ఆయనకు సలహాలు ఇచ్చే వారు కూడా ఉండరు. కానీ, ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో లగడపాటి వ్యూహకర్తలా పని చేస్తున్నారట. అభ్యర్థుల ఎంపికలో విషయం నుంచి ప్రతి దానిలో ఆయన చంద్రబాబుకు ఎంతగానో సాయం చేశారని ఆ పార్టీలోని కొందరు నేతలు బాహాటంగానే చెబుతున్నారు.

సర్వేల ద్వారా లగడపాటి ఎన్నో సార్లు ప్రజల నాడిని కచ్చితంగా అంచనా వేశారు. దీనికితోడు ఆయన రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత కావడంతో చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యతనిచ్చారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి లగడపాటి రాజగోపాల్ తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల కోసం చేసిన సర్వే ఫలితాలు తప్పు మిగతా సర్వేలన్నీ దాదాపుగా నిజమవుతూ వచ్చాయి. 2014లో ఏపీలో చేసిన సర్వేల్లో చాలా సంస్థలు వైసీపీ విజయం సాధిస్తుందని పేర్కొనగా, లగడపాటి మాత్రం టీడీపీనే గెలుస్తుందని చెప్పారు. అక్కడ అలాగే జరిగింది. అలాగే నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలో కూడా ఆయన చెప్పినట్లే రిజల్ట్ వచ్చింది. అందుకే లగడపాటి రాజగోపాల్ అంటే చంద్రబాబుకు నమ్మకం ఏర్పడిందని వినికిడి. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ (పీకే) వ్యూహకర్తగా పని చేసిన విషయం తెలిసిందే.