Begin typing your search above and press return to search.
లగడపాటి సర్వే నిజమైతే వైసీపీ దున్నేసినట్లే
By: Tupaki Desk | 21 Feb 2017 4:54 PM GMTపక్కా ఎన్నికల విశ్లేషణలకు పెట్టింది పేరయిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరుతో సోషల్ మీడియాలో తాజాగా మరో సర్వే విస్తృత ప్రచారం జరుగుతోంది. లగడపాటిని ప్రస్తావిస్తూ పలువురు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్న ఈ సర్వే ప్రకారం ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కమారింది. అధికార పార్టీకి ఈ సర్వేలో 63 సీట్లు దక్కగా వైసీపీకి మాత్రం 112 సీట్లతో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు లగడపాటి సర్వేలో తేలింది. లగడపాటి సర్వేతో అధికార పార్టీకి మాత్రం తిక్క తెప్పించేలా సర్వేలో ఫలితాలు వెలువడ్డాయని అంటున్నారు.
ఇటీవల పెద్ద ఎత్తున నేతలు పార్టీలో చేరడం,రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్న జగన్ ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరుతో ఆ పార్టీ గ్రాఫ్ ఓ రేంజ్ లో పెరిగిపోతుందని అభిప్రాయాలు వెలువడిన సంగతి తెలిసిందే. సహజంగా అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి కానీ దానికి రివర్స్ అయి ప్రతిపక్షమైన వైసీపీలోకి టీడీపీ నేతలు రావడంతో కూడా ఆ పార్టీకి పెరుగుతున్న ఆదరణకు సైతం మచ్చుతునకగా చెప్తున్నారు. ఇలాంటి అభిప్రాయల సమయంలో లగడపాటి పేరుతో సోషల్ మీడియాలో చెలామణిలో ఉన్న సర్వే హాట్ టాపిక్ అయింది.
లగడపాటి సర్వేను జిల్లాల వారీగా పరిశీలిస్తే....
జిల్లా పేరు టీడీపీ వైసీపీ
అనంతపురం 7 - 7
గుంటూరు 6 - 11
కృష్ణ 5 - 11
శ్రీకాకుళం 5-5
విజయనగరం 3 - 6
విశాఖ పట్నం 8 - 6
తూర్పుగోదావరి 8 - 11
పశ్చిమ గోదావరి 6 - 8
ప్రకాశం 3 - 9
నెల్లూరు 2 - 8
చిత్తూరు 5 - 9
కడప 2 - 8
కర్నూలు 4 - 10