Begin typing your search above and press return to search.
టీడీపీని భయపెడుతున్న లగడపాటి సర్వే?
By: Tupaki Desk | 8 July 2017 9:55 AM GMTరాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఎన్నికల మాట వినిపిస్తే చాలు సర్వేలతో జనం నాడిని చెప్పే ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ త్వరలో జరగబోయే నంద్యాల ఉప ఎన్నిక కోసం కూడా సర్వే చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు... ఈ ఉప ఎన్నికలో వైసీపీదే విజయమని ఆయన సర్వేలో తేలిందని వినిపిస్తోంది. దీనిపై పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం కూడా జరుగుతోంది.
నంద్యాల నియోజకవర్గంలో లగడపాటి అయిదురోజుల పాటు సర్వే చేశారని.. అధికార పార్టీ ఓడిపోవడం ఖాయమని ఆ సర్వేలో తేలిందని వినిపిస్తోంది. అయితే, వెల్లడించడానికి లగడపాటి సుముఖంగా లేరని తెలుస్తోంది. రాష్ర్ట విభజన తరువాత రాజకీయాలకు దూరమైన లగడపాటి గత కొంత కాలంగా టీడీపీకి చేరువవుతున్నారు. టీడీపీలో చేరేందుకు రెండు వైపుల నుంచి చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికీ లగడపాటి టీడీపీలో చేరే అవకాశాలున్నాయన్నది రాజకీయవర్గాల మాట. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా సర్వే ఫలితాలను వెల్లడించి చంద్రబాబుకు దూరం కాదలచుకోలేదని తెలుస్తోంది.
అయితే... నంద్యాల సంగతి చంద్రబాబుకు కూడా అర్థమైందని, అక్కడ గెలుపు అంత సులభం కాదని చంద్రబాబు కూడా గ్రహించినట్లు చెప్తున్నారు. అందుకే అన్ని ప్రయత్నాలూ చేస్తూ మంత్రులను అక్కడ రంగంలోకి దించి ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.