Begin typing your search above and press return to search.
లగడపాటి నుంచి వేరే ఏం ఎక్స్ పెక్ట్ చేయడానికి లేదు!
By: Tupaki Desk | 27 April 2019 4:45 PM GMTఆయన వెళ్లింది ఎన్ ఆర్ ఐ తెలుగుదేశం పార్టీ అభిమానులతో సమావేశానికి. ఆయనకు వెల్కమ్ చెప్పింది అమెరికాలోని పచ్చదండు. 'జై చంద్రబాబు..' అని నినదించే వాళ్లే లగడపాటి చుట్టూ కనిపించారు. ఎన్ఆర్ఐ తెలుగుదేశం వింగ్ వాళ్లు చంద్రబాబు చుట్టూ కనిపించారు. వారంతా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందని ప్రకటించేశారు కూడా!
వారితో పాటు లగడపాటి కూడా అదే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ను చూసి మోడీ భయపడ్డారని - గుజరాత్ ను ఏపీ మించిపోతుందని మోడీ భయపడ్డారని.. అంటూ చెప్పుకొచ్చారు ఈయన. తెలుగుదేశం పార్టీ వీరాభిమానిలా మాట్లాడారు ఈ మాజీ ఎంపీ!
ఇప్పుడే కాదు.. గత కొన్నాళ్లుగా లగడపాటి తెలుగుదేశం పార్టీతో చాలా సాన్నిహిత్యంతో కొనసాగుతూ ఉన్నారు. తరచూ చంద్రబాబుతో సమావేశం అవుతూ వచ్చారు. బాబుకు సన్నిహితుడిగా పేరున్న పత్రికాధినేతతో కలిసి ఆ మధ్య లగడపాటి ప్రత్యేకంగా చంద్రబాబుతో సమావేశం అయ్యారు.
ఇక తెలంగాణ ఎన్నికల ముందు - తెలంగాణ పోలింగ్ తర్వాత కూడా లగడపాటి తెలుగుదేశం పార్టీ అనుకూలుడుగానే వ్యవహరించారు. పోలింగ్ పూర్తి అయ్యాకా కూడా తెలుగుదేశం - కాంగ్రెస్ ల మహాకూటమే గెలుస్తుందని వ్యాఖ్యానించి లగడపాటి తన సర్వేలకు విలువను కోల్పోయారు!
ఇక ఇప్పుడు లగడపాటి మళ్లీ ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు. మే పంతొమ్మిదిన తన ఎగ్జిట్ పోల్ విడుదల అని ప్రకటించారు. లగడపాటి చుట్టూ జై చంద్రబాబు నినాదాలు మార్మోగుతూ ఉండగా.. ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. దీన్ని బట్టి.. ఆయన ఏం చెప్పబోతున్నారో కూడా అర్థం చేసుకోవడం కష్టంకాదు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు!