Begin typing your search above and press return to search.
లగడపాటి అన్ని సర్వేలు చేయించాడా!
By: Tupaki Desk | 4 May 2019 4:48 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు లగడపాటి చెప్పిన సర్వే పూర్తిగా అబద్ధం అయ్యింది. పోలింగ్ కు ముందు నుంచినే లగడపాటి మాట్లాడుతూ కేసీఆర్ పార్టీ ఓడిపోయే అవకాశాలున్నాయన్నట్టుగా మాట్లాడారు. ఇండిపెండెంట్లు భారీగా నెగ్గుతుతారని చెప్పుకొచ్చారు. కొంతమంది ఇండిపెండెంట్ల పేర్లు చెప్పి వాళ్లు నెగ్గుతారని లగడపాటి చెప్పుకొచ్చారు. అయితే అది పూర్తిగా అబద్ధం అయ్యింది.
లగడపాటి అంచనాలు పూర్తిగా తలకిందుల అయ్యాయి. ఇక పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వే అంటూ మరో కహానీ చెప్పారు లగడపాటి. అది మరో అబద్ధం అయ్యింది. లగడపాటి అంత వరకూ సర్వేల విషయంలో కలిగిన ఇమేజ్ నంతా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కోల్పోయారు.
ఆయన చెప్పిన మాటలు ఏవీ నిజం కాకపోవడం - ఆయన సర్వే ఫలితం పూర్తిగా అబద్ధమని తేలడంతో ఇక నుంచి లగడపాటి సర్వేలకు నమ్మకం కలగడం కష్టంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కోల్పోయిన ఆ ఇమేజ్ విషయంలో లగడపాటి ఇప్పుడు దృష్టి సారించాడట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో లగడపాటి గట్టిగా సర్వేలు చేయించుకున్నాడట. ఏకంగా ఐదు టీమ్ లతో వేర్వేరు సర్వేలు చేయించుకుని రిపోర్ట్స్ తెప్పించుకున్నాడట లగడపాటి.
ఆ సర్వేల కోసం పక్క రాష్ట్రాల నుంచి టీమ్ లను రప్పించుకున్నాడట. అలాగే ఒక టీవీ చానల్ ద్వారా కూడా సర్వే చేయించుకున్నాడట. వీటి ద్వారా ఒక అంచనాకు వచ్చేందుకు ఆయన ప్రయత్నించాడట! మరి ఇంత చేసినా ఇప్పుడు అయితే ఏం చెప్పడానికి లేదు. దేశ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ అంతా పూర్తి అయితే కానీ ఇలాంటి సర్వేల ఫలితాలు చెప్పేందుకు కూడా లేదు. ఇప్పటికి అయితే ఇలాంటి బిల్డప్పులు బాగానే ఇస్తున్నారు కానీ, ఈ సర్వేల అంచనాలు ఈ సారి ఎలా ఉంటాయో - ఏ మేరకు నిజం అవుతాయో!