Begin typing your search above and press return to search.
పవన్ గెలుపుపై లగడపాటి సంచలన ప్రకటన
By: Tupaki Desk | 18 May 2019 1:36 PM GMTలగడపాటి రాజగోపాల్.. తెలుగు రాష్ట్రాల వారికి పరిచయం అవసరం లేని పేరింది. రాజకీయ నేతగా ఓ వెలుగు వెలిగిన ఈయన.. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే వివాదంతో సంచలనం అయ్యారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రం ముందే ప్రకటించినట్లుగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉంటున్నారు. అదే సమయంలో సర్వేలు మాత్రం చేస్తూ రాజకీయ రంగంపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆయన చెప్పే సర్వేలు నిజమయ్యాయా..? లేదా..? అన్నది పక్కన పెడితే.. ఈ విషయంలో లగడపాటికి మాత్రం ఆక్టోపస్ అనే పేరు వచ్చింది. దీంతో రాజకీయాల్లో కంటే సర్వేలు చెప్పినప్పుడే ఆయన ఎక్కువ ఫేమస్ అయ్యారు.
గత డిసెంబర్ లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జనసమితి - సీపీఐ పార్టీలు కలిసి ఏర్పడిన ప్రజాకూటమి విజయం సాధిస్తుందని చెప్పారు. కానీ, అక్కడ ఆయన అంచనాలు తప్పాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించి, వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుంచి లగడపాటి పెద్దగా మీడియా ముందుకు వచ్చింది లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక - లోక్ సభ ఎన్నికలపై సర్వేలు నిర్వహిస్తానని మాత్రం చెప్పారు. ఇందులో భాగంగానే ఆదివారంతో తుది విడుత ఎన్నికలు పూర్తవుతాయి. ఇక, అదే రోజు ఎగ్జిట్ పోల్స్ చెప్పుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని కోసమే ఆయన శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలో జరిగిన ఎన్నికల ఫలితాలను ఆదివారం సాయంత్ర తిరుమలలో వెల్లడిస్తానని లగడపాటి వెల్లడించారు. అంతేకాదు, ముందస్తు ఎన్నికల్లో తన అంచనా తప్పడానికి గల కారణాలను ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చెబుతానన్నారు. తన సర్వేలపై ఎవరి ప్రభావం - ఒత్తిడి ఉండవని చెప్పిన ఆయన పవన్ విజయం సాధిస్తారా? అన్న ప్రశ్నకు మాత్రం ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ‘‘వెలగపూడిలో ఉన్న శాసనసభలోకి పవన్ కల్యాణ్ కచ్చితంగా అడుగుపెడతాడు. వెలగపూడి - మర్కాపురం ప్రజల సాక్షిగా చెబుతున్నాను. మీ పక్కనే ఉన్న శాసనసభలో పవర్ స్టార్ అడుగు పెడతాడు’’ అంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. అయితే, పవన్ ఏ స్థానం నుంచి గెలుస్తారు అన్నది మాత్రం వెల్లడించలేదు.