Begin typing your search above and press return to search.
సర్వే వివరాలు అప్పుడు వెల్లడిస్తా:లగడపాటి
By: Tupaki Desk | 30 July 2018 1:34 PM GMTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ....విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏపీ నేతలలో ప్రముఖంగా వినిపించే పేరు లగడపాటి రాజగోపాల్. కారణాలేమైనప్పటికీ.... విభజనకు ససేమిరా అన్న లగడపాటి....తన నిరాహార దీక్షతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఆ తర్వాత....ఆయన దీక్షాస్థలి నుంచి హైదరాబాద్ లో ప్రత్యక్షమవడం....నానా రచ్చ చేయడం తెలిసిందే. ఇక లోక్ సభలో పెప్పర్ స్ప్రే ..ఎపిసోడ్ తో లగడపాటి పేరు నేషనల్ మీడియాలో కూడా మార్మోగిపోయింది. రాష్ట్రవిభజన జరిగితే...తాను రాజకీయాలనుంచి తప్పుకుంటా అని లగడపాటి చెప్పిన...ఇప్పటివరకు అదే మాట మీదున్నారు. అయితే, ఆయన టీడీపీలో చేరబోతున్నారంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఆ పుకార్లపై లగడపాటి తాజాగా స్పందించారు. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని లగడపాటి మరోసారి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న లగడపాటి...మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై కూడా లగడపాటి స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది....ఆంధ్ర రాష్ట్ర ప్రజల బలమైన ఆకాంక్ష అని లగడపాటి అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు - ఉద్యోగాలు వస్తాయని వారు బలంగా నమ్ముతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమనే దృక్పథంతో వారున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించినందుకే గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారని, హోదా ఇవ్వని పక్షంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అదే గతిపడుతుందని జోస్యం చెప్పారు. అయితే, ప్రాణ త్యాగాలు - ఆత్మ బలిదానాలతో ప్రత్యేక హోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమని అన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నానని చెప్పారు. తాను చేపట్టిన సర్వే వివరాలను 2019 ఎన్నికలకు ముందుగా విడుదల చేస్తానని చెప్పారు. గతంలో కూడా నంద్యాల ఉప ఎన్నిక సమయంలో లగడపాటి సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే.