Begin typing your search above and press return to search.
టీడీపీ కోటకు బీటలు..లగడపాటిపై జగన్ పంచ్ లు
By: Tupaki Desk | 11 March 2019 4:37 PM GMTఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో వైసీపీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమరశంఖారావం పూరించారు. కాకినాడలో నిర్వహించిన సమర శంఖారావం సభలో ఎన్నికల నగారా మోగించారు. ఈ సందర్భంగా బూత్ కమిటీ సభ్యులకు పార్టీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అన్నొస్తున్నాడని అందరికి చెప్పాలని సూచించారు. తెలుగు దేశం పార్టీకి శాంతియుతంగా సమాధి కట్టాలని - ఆ పార్టీకి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని గ్రామాల్లో చెప్పాలని ఆయన ప్రకటించారు. ప్రజలను వంచించిన బాబుకు బుద్ధి చెప్పే రోజు వచ్చిందని అందరికి చెప్పాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాజన్న రాజ్యం మళ్లీ రావాలన్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలని అర్థమయ్యేలా ప్రజలకు చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``రాబోయే రోజుల్లో లగడపాటి లాంటి వారు దొంగసర్వేలతో ముందుకొస్తారు. తెలంగాణలో లగడపాటి సర్వే అంటూ కుట్రకు తెరతీశారు. ఆ సర్వేను ఎల్లో మీడియా మోయడాన్నీ మనం చూసాం`` అంటూ వైఎస్ జగన్ టీడీపీ కుట్రలను ఎండగట్టారు.
చంద్రబాబు దుర్మార్గపు పాలనపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని జగన్ కోరారు. ``పోలవరం ప్రాజెక్టు చూస్తే - తాత్కాలిక అసెంబ్లీ - సచివాలయం - ఆ భవనాల్లోకి వెళ్లే రోడ్లను చూపిస్తే బీటలు కనిపిస్తాయి. పోలవరం పునాధి గోడలు దాటి ముందుకు కదలడం లేదు. ఆ పోలవరం ప్రాజెక్టులో బీటలు కనిపిస్తాయి. రాజధానిలో తాత్కాలిక భవనాలు తప్ప శాశ్వతం అనేది ఏదీ కనిపించదు. ఆ తాత్కాలిక భవనాల్లో బయట 3 సెంటీ మీటర్ల వర్షం కురిస్తే లోపల 6 సెంటీమీటర్ల నీళ్లు కనిపిస్తాయి. ఏ ఒక్కటీ కూడా వదలకుండా ఇంత దారుణంగా రాష్ట్రాన్ని దోచేస్తున్న చంద్రబాబు పాలనపై చర్చ జరగాలి`` అని జగన్ కోరారు. ``ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేసిన మోసగాడు. ప్రపంచంలోనే నంబర్ వన్ అవినీతి పరుడు - ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన నేరగాడు. చివరకు తనకు ఓట్లు వేయరనుకుంటే ప్రజల ఓట్లను తీయించే నంబర్ వన్ క్రిమినల్. ఇటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇటువంటి వ్యక్తిని కొన్ని టీవీలు - కొన్ని పత్రికలు నెత్తినపెట్టుకొని మోస్తున్నాయి. ఇటువంటి పచ్చ మీడియా ఈనాడు - ఆంధ్రజ్యోతి - టీవీ5 ఇంకా మిగిలిన పచ్చ ఛానళ్లు చంద్రబాబును భుజాన వేసుకొని మోస్తున్నారు. `` అంటూ మండిపడ్డారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రజలకు ఏం చేయనుందో వివరించాలని జగన్ కోరారు. ``రేపు పొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తరువాత రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు బడికి పంపించినందుకు సంవత్సరానికి రూ. 15 వేలు అన్న ఇస్తాడని చెప్పాలి. ఓటు కోసం చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పాలి. ఈ రోజు మన పిల్లలు ఇంజినీరింగ్ - డాక్టర్ చదువులు చదవలేరు. చదువుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నాం. రేపు పొద్దున్న అన్న ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు రూ. 3 వేలకు మోసపోవద్దు. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను ఇంజినీరింగ్ చదవాలన్నా - డాక్టర్ లుగా చేయాలన్నా.. కలెక్టర్ వంటి చదువులకు ఎన్ని లక్షలు అయినా సరే అన్న చదివిస్తాడని ప్రతి గ్రామంలో చెప్పాలి. ప్రతి అక్కకు చెప్పాలి. ప్రతి అన్నకు చెప్పాలి. ప్రతి చెల్లికి చెప్పాలి.`` అని సూచించారు.