Begin typing your search above and press return to search.
కండువా మార్చనున్న లగడపాటి
By: Tupaki Desk | 24 Sep 2015 2:56 PM GMTలగడపాటి రాజగోపాల్…తెలుగు రాష్ర్టాల రాజకీయాలపై...కరెక్టుగా చెప్పాలంటే దేశ రాజకీయాలపై అవగాహన ఉన్నవారందరికీ ఈ పేరు సుపరిచితం. తెలంగాణను ఏర్పాటును నిరసిస్తూ, ఆంద్రప్రదేశ్ విభజనను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఆఖరికి పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కూడా వదిలి అప్పటి ఎంపీలందరినీ సభలో నుంచి పరుగెత్తేలా చేశారు. రాష్ర్ట విభజన జరిగిన తర్వాత ఆ ప్రక్రియను నిరసిస్తూ కాంగ్రెస్ కు రాజీనామ చేయడమే …రాజకీయాల్లో కొనసాగబోనని ప్రకటించారు. అయితే అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున ప్రచారం చేశారు. తాజాగా ఇపుడు ఆయన రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును లగడపాటి రాజగోపాల్ కలిశారు. దాదాపు గంటపాటు వీరి సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ భేటీపై తెలుగుదేశం వర్గాలు సహా, లగడపాటి రాజగోపాల్ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే లగడపాటి తెలుగుదేశంలో చేరేందుకు అంతా సిద్దమైనట్లేనని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.