Begin typing your search above and press return to search.
లగడపాటి తెలంగాణలో పోటీ చేస్తారా?
By: Tupaki Desk | 31 Jan 2019 4:02 AM GMTకనిపించని దరిద్రమంతా ఆంధ్రా నేతల్లోనే ఉంటుందా? అంటే అవునని చెప్పాలి. ఇంటి యవ్వారం చక్కదిద్దుకోలేడు కానీ బయటకొచ్చి రాజ్యమేలుతానంటే ఎంత ఛండాలంగా ఉంటుంది. తాజాగా లగడపాటి రాజగోపాల్ అనే ప్రముఖుడి మాటలు ఇదే రీతిలో ఉన్నాయి. విభజనను వ్యతిరేకించటం తప్పేం కాదు. ఉద్యమాలు సరికావనటం ఆయన సొంత అభిప్రాయంగా సరిపెట్టుకోవచ్చు.
తెలంగాణ అంటే పడని లగడపాటికి తెలంగాణ మీద అభిమానం పొంగిపొర్లటం.. విభజన తర్వాత చస్తే రాజకీయాల జోలికి వెళ్లనని చెప్పి.. అదే మాట ఉన్న పెద్ద మనిషికి ఇప్పుడు ఉన్నట్లుండి తెలంగాణలో పోటీ చేయాలన్న ఆలోచన రావటం ఆసక్తికరమని చెప్పాలి. లగడపాటి తెలంగాణలోనే కాదు.. అవసరమైతే జార్ఖండ్ లోనూ.. కేరళలోనూ.. ఉత్తరప్రదేశ్ తో సహా దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ.. తెలంగాణను ఆది నుంచి వ్యతిరేకించి.. ఇప్పుడు అదే చోట పోటీ చేస్తానని చెప్పటం ఆయనకు మాత్రమే చెల్లుతుందేమో?
తెలంగాణను వ్యతిరేకించిన లగడపాటి ఆ పని తానెందుకు చేస్తున్నానో చెప్పలేదు. తెలంగాణ పోరాటానికి వ్యతిరేకంగా తానెందుకు పని చేస్తున్నానో చెప్పి.. తన మాటలతోనూ.. చేతలతోనూ కొద్దిమందిని కూడగట్టటం ఎక్కడా కనిపించదు.
తన వెకిలి చేష్టలతో వ్యక్తిగతంగా లగడపాటి చులకన కావటమే కాదు.. ఆంధ్రా మూలాల కారణంగా ఆంధ్రోళ్లు సైతం ఆయన పేరుతో అవమానాలు పడిన పరిస్థితి. విభజన కారణంగా ఆంధ్రా తీవ్రంగా నష్టపోయిందని ఫీలయ్యే లగడపాటి లాంటోళ్లు చట్టసభలకు పోటీ చేసి.. ఆంధ్రా బాగుపడటానికి అవసరమైన ప్రయత్నాల్నిచేయాలి. కానీ.. అవేమీ చేయని ఆయన తనకు అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పటం దేనికి నిదర్శనం?
లగడపాటి లాంటోళ్ల పేరుతో ఆంధ్రోళ్లను తిట్టటం కేసీఆర్ అండ్ కోకు అలవాటే. తన కారణంగా తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంత ప్రజలు గౌరవ మర్యాదలు పొందకున్నా ఫర్లేదు. కానీ.. ఆ పేరుతో తిట్లు తినాల్సి రావటాన్ని లగడపాటి ఎప్పుడైనా ఆలోచించారా? అన్న ప్రశ్న రాక మానదు. తాను ఎవరి జోక్యంతోనూ నడుచుకునే వ్యక్తిని కాదని చెప్పే లగడపాటి.. తాను చేయించిన సర్వే తప్పు అయితే క్షమాపణలు చెప్పేందుకు అభ్యంతరం లేదన్నారు.
తాను ఒక సిద్దాంతానికి కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెప్పిన ఆయన.. తెలంగాణలో పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పటం ఆసక్తి రేకెత్తించే అంశంగా చెప్పాలి. తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి.. ఏ ముఖంతో తెలంగాణలో పోటీ చేయటం తనకిష్టమని చెబుతున్నట్లు? మరింత కాలం ఏ ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి.. ఆ ప్రజల గురించి.. ఆ రాష్ట్రం గురించి ఆలోచించకుండా పక్క రాష్ట్రంలో పోటీకి ఉత్సుకతను ప్రదర్శించటం ఏమిటి? ఇందులో మర్మం ఏమిటి లగడపాటి?