Begin typing your search above and press return to search.
#లతాజీ.. 2 రోజుల జాతీయ సంతాప దినాలు
By: Tupaki Desk | 6 Feb 2022 7:30 AM GMTమేటి గాయని లతా మంగేష్కర్ నేటి ఉదయం ఇహలోకాన్ని వీడి నింగికేగిన సంగతి తెలిసిందే. లతాజీ మృతి సందర్భంగా దేశ ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. అలాగే రెండు రోజుల జాతీయ సంతాప దినాలు పాటించనున్నట్లు అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. జాతీయ జెండాను అర్ధ స్తంభానికి ఎగురవేస్తామని.. ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) కన్నుమూశారని తెలియగానే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సెలబ్రిటీలు తమ సంతాపం తెలియజేసారు. సోషల్ మీడియాల్లో సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. లతా మంగేష్కర్ గత నెలలో COVID-19 పాజిటివ్ అని తెలిసాక.. ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆమెకు న్యుమోనియా కూడా ఉన్నట్లు నిర్ధారణ అయింది. లతాజీ తేలికపాటి కరోనా లక్షణాలను కలిగి ఉన్నారని.. కాలక్రమేణా కోలుకుంటున్నారని కథనాలొచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఆమె పరిస్థితి మరింత దిగజారినప్పటికీ ఆమెకు ఇన్వేసివ్ వెంటిలేటర్ సపోర్టు పెట్టారు. కానీ నేడు పరిస్థితి విషమించి మృతి చెందారు. అనంతరం వైద్యులు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో లతా మంగేష్కర్ మృతి చెందారని ప్రకటించారు.
మంగేష్కర్ మృతికి సంతాపం తెలుపుతూ ప్రతిభావంతులు హెలెన్ సంతాపం తెలిపారు. లతా మంగేష్కర్‌తో కలిసి రెండు పాటల్లో పాల్గొన్నందుకు నాకు గౌరవం లభించింది.. అని తెలిపారు. లతా దీదీ పాటలకు అనేక రకాల భావోద్వేగాలను తీసుకొచ్చాయి. దశాబ్దాలుగా ఆమె భారతీయ చలనచిత్ర ప్రపంచం పరివర్తనలను దగ్గరగా చూసారు. సినిమాలకు అతీతంగా ఆమె భారతదేశం ఎదుగుదల పట్ల ఎల్లప్పుడూ మక్కువ చూపుతుంది. ఆమె ఎల్లప్పుడూ బలమైన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకుంటారు.. అని అన్నారు.
లతా దీదీ నుండి నేను ఎప్పుడూ అపారమైన ఆప్యాయతను పొందడం నా గౌరవంగా భావిస్తున్నాను. ఆమెతో నా పరస్పర చర్యలు మరువలేనివిగా మిగిలిపోతాయి. లతా దీదీ మరణించినందుకు నా తోటి భారతీయుల వలె నేను కూడా బాధపడుతున్నాను. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి అని ఆయన మరో ట్వీట్ లో పేర్కొన్నారు.