Begin typing your search above and press return to search.
700 కోట్లు విలువైన బీర్ పారబోశారా ?
By: Tupaki Desk | 4 May 2020 9:50 AM GMTకరోనా మహమ్మారి..చైనా లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి, అక్కడినుండి ఒక్కొక్క దేశానికీ విస్తరిస్తూ.. ప్రస్తుతం దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలకి పాకింది. మనదేశంలో కూడా ఈ కరోనా అలజడి సృష్టిస్తుంది. ఈ కరోనా ను అడ్డుకోవడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. రెండోదశ లాక్ డౌన్ గడువు మే 3 తో ముగిసినప్పటికీ ..కరోనా కంట్రోల్ లోకి రాకపోవడంతో మే 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించారు.
ఈ లాక్ డౌన్ వల్ల అనేక రంగాలు కుదేలైయ్యాయి. ఎంతోమంది ఎన్నోరకాలుగా ఇబ్బందులకు గురైయ్యారు. కాగా , లాక్ డౌన్ కారణంగా దాదాపు నెలన్నరగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేసి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 250 మైక్రో బ్రూవరీల వద్ద ఫ్రెష్, క్రాఫ్ట్ బీరు నిల్వలు పేరుకు పోయాయి. దీని మొత్తం ఎనిమిది లక్షల లీటర్ల ఫ్రెష్ బీరు వృథాగా ఉన్నదని పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి.
బాటిళ్లలో నింపే బీరు అయితే కొంచెం ఎక్కువ రోజులు పాడవదు అని, ఆలా కాకుండా క్లబ్బులు, బార్లలో లభించే ఫ్రెష్, క్రాఫ్ట్ బీర్లు తొందరగా పాడవుతాయని మద్యం ఉత్పాదక సంస్థల సంఘం (క్రాఫ్ట్ బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) వర్గాలు తెలియజేశాయి. అయితే , తాజాగా లాక్ డౌన్ నుండి కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. అయితే , ఈ సడలింపుల్లో మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా , బార్లు, క్లబ్బులకు సడలింపులు ఇవ్వలేదు. ఈ సమయంలో ఉత్పత్తి సంస్థలన్నీ బీరును పారబోసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. మరోవైపు, దేశీయంగా ఉత్పత్తిచేసిన 12లక్షల కేసుల విదేశీ మద్యం లాక్ డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయినట్టు సీబీఏఐ తెలిపింది. దీని విలువ రూ.700 కోట్లు అని ఓ కథనంలో తెలిపారు.