Begin typing your search above and press return to search.
ఇప్పుడీ ‘బీపీ’ మాటలు అవసరమా లక్ష్మారెడ్డి?
By: Tupaki Desk | 8 Aug 2016 6:11 AM GMTకొన్ని మాటలు వినేందుకు మామూలుగా అనిపించినా.. వాటి ప్రభావం మాత్రం వేరుగా ఉంటుంది. అసలే గ్రహాలు అనుకూలించక కిందామీదా పడుతున్న మంత్రి లక్ష్మారెడ్డి లాంటి వారు ఆచితూచి వ్యవహరించాల్సిన వేళలో.. టంగ్ స్లిప్ కావటం గమనార్హం. ఆ మధ్యన ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో విద్యా..వైద్య శాఖలో భారీ అవినీతికి అవకాశం ఉందని.. గ్రహాలు బాగోలేదని.. సంబంధిత శాఖా మంత్రులు జాగ్రత్తగా ఉండాలంటూ అయ్యవార్లు చెప్పినప్పుడు వైద్యా శాఖామంత్రి లక్ష్మారెడ్డి ఎంతలా నవ్వారో.. ఈ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను చూస్తే అర్థమవుతుంది.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఎంసెట్ 2 కుంభకోణం విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యమా సీరియస్ గా ఉన్నారని.. విద్యా..వైద్య శాఖామంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తాను మంత్రి కాక ముందు బీపీ.. షుగర్ లేవని.. ఇప్పుడు బీపీ వచ్చిందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు లక్ష్మారెడ్డికి నెగిటివ్ గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
టైం బాగోని వేళ..మామూలు మాటలు సైతం టైంబాంబుల మాదిరే పేలే అవకాశం ఉన్నప్పుడు.. మంత్రిని అయ్యాక బీపీ పెరిగిందన్నమాటలు పార్టీ అధినేతకు బీపీ తెప్పిస్తే.. లక్ష్మారెడ్డి పరిస్థితి ఏమిటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రహాలు అనుకూలించని వేళలో..నోరు విప్పి ఏదో ఒకటి మాట్లాడే కన్నా వీలైనంత వరకూ ఆచితూచి మాట్లాడితే మంచిదని.. అనవసర విషయాలకు సంబంధించి వార్తల్లో నానితే కేసీఆర్ కు ఎంత చిరాకన్న విషయం తెలిసి కూడా లక్ష్మారెడ్డి ఇలా వ్యవహరించటం ఏమిటి చెప్మా..?