Begin typing your search above and press return to search.
ప్రత్యేక హోదా కోసం మరొకరి ఆత్మహత్య
By: Tupaki Desk | 27 Aug 2015 5:29 AM GMTఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం ఎక్కడకు వెళుతుందో అర్థం కావడం లేదు. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో కాంగ్రెస్ నాయకుల సమావేశంలో మునికోటి అనే కాంగ్రెస్ కార్యకర్త కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తర్వాత కృష్ణా జిల్లా పామర్రులో విలేకరి చావలి సుబ్బారావు...పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో రాష్ర్ట విభజన వల్ల తన కుమార్తెకు ఉద్యోగం రాకుండా అన్యాయం జరిగిందని మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ సంఘటనలు మర్చిపోకముందే నెల్లూరు జిల్లాలో గురువారం మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు .జిల్లా వేదాయపాలెంకు చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే లక్ష్మయ్య ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో ఉండడం సంచలనంగా మారింది.
ఏపీకి ప్రత్యేక హోదాపై నాయకులు చెపుతున్న మాటలపై ప్రజలకు నమ్మకం పోయింది. కనీసం ప్యాకేజీ అయినా తెస్తారని ప్రజలు విశ్వసించడం లేదు. చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ఈ విషయం చాలా క్లీయర్ కట్ గా సామాన్యులకు కూడా అర్థమైపోయింది. రాష్ర్ట విభజన వల్ల నష్టపోయిన చాలా మంది ఈ ఆవేశంలో ఏం చేస్తారోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, కేంద్రమంత్రులు ఇలాంటి ఆఘాయత్యాలకు పాల్పడవద్దని చెపుతున్నా వారి బాధలను తీర్చే నాథుడు లేక వారి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు.