Begin typing your search above and press return to search.
మొన్న గడ్కరీ..నిన్న రాందేవ్ బాబా.. ఇవాళ బీజేపీ మహిళా నేత!
By: Tupaki Desk | 27 Dec 2018 5:58 AM GMTమోడీ మీద సామాన్యుడి ఆగ్రహం గడిచిన కొంతకాలంగా ఉన్నదే. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మరీ ముఖ్యంగా బీజేపీ పవర్లో ఉన్న మూడు రాష్ట్రాల్లో పవర్ చేజారిన నేపథ్యంలో సొంత పార్టీ నేతల్లో ఆగ్రహం అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితి. బీజేపీకి దన్నుగా ఉన్న పలువురు ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని ఏ చిన్న అవకాశం వచ్చినా వ్యక్తం చేస్తున్న వేళ.. దానికి కొనసాగింపుగా బీజేపీ మహిళా నేత.. పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి లక్ష్మీకాంత్ చావ్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
బుల్లెట్ ట్రైన్ల పేరుతో హడావుడి చేసే మోడీ తీరును ఆమె తప్పు పట్టటమే కాదు.. సామాన్యులు వినియోగించే మామూలు ట్రైన్లు టైంకు నడిచేలా చూడు మోడీ సాబ్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇటీవల ఆమె ప్రయాణించాల్సిన ట్రైన్ ఒకటి తొమ్మిది గంటల ఆలస్యంగా వచ్చింది. దీంతో చిర్రెత్తిపోయిన ఆమె మోడీ పాలన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కోపాన్ని ఒకరు వీడియో రూపంలో షూట్ చేయటం.. అది కాస్తా సోషల్ మీడియాలోకి రావటంతో ఇప్పుడా అంశం హాట్ టాపిక్ గా మారింది.
పంజాబ్ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ చావ్లా ప్రయాణించాల్సిన సరయూ ఎక్స్ ప్రెస్ తొమ్మిది గంటలు ఆలస్యంగా వచ్చింది. ట్రైన్ ఆలస్యంపై స్పందించిన లక్ష్మీకాంత్.. "మోడీజీ.. బుల్లెట్ రైలును మర్చిపోండి.. ఇప్పుడు నడుస్తున్న ట్రైన్ ను సమయానికి నడిపే అంశంపై దృష్టి పెట్టండి. ధనవంతుల గురించి కాదు.
సామాన్యుల గురించి ఆలోచించండి. తలుపులు.. కిటికీలు సరిగా లేవు. క్యాటరింగ్ కూడా ఉండదు. నీళ్లు ఉండవు. బాత్రూములు సరిగా లేవు. 24 గంటలు ఎలా ప్రయాణిస్తాం. ఎప్పుడు ట్రైన్ వెళుతుంది? ఎందుకు ఆలస్యమవుతుంది? అన్న విషయాలు ఎవరికీ తెలియవు. ఫిర్యాదులపై గొప్పగా ప్రచారం చేస్తారు. కానీ.. వాస్తవరూపంలో మాత్రం వాటిని ఎవరూ పట్టించుకునే నాథుడే లేడు" అంటూ ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒక సభలో మాట్లాడుతూ.. మోడీ తీరును పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు చేయటం ఒక సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎవరు ప్రధాని? అన్న ప్రశ్నకు రాందేవ్ బాబా సమాధానం చెప్పలేనని చెప్పటం వార్తాంశంగా మారింది. తాజాగా బీజేపీ సీనియర్ నేత చేసిన ఘాటు విమర్శలన్నీ మోడీ పాలన మీదా.. ఆయన సర్కారు పని తీరును ప్రస్తావిస్తూ చేసినవి కావటం గమనార్హం.