Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతి ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ
By: Tupaki Desk | 7 Jun 2016 4:50 PM GMTదివంగత మాజీ ముఖ్యమంత్రి - టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీపార్వతి ఎన్నో సంచలనాలకే కేంద్ర బిందువయ్యారు. తెలుగుజాతి ఖ్యాతిని నలుదిశలా చాటిన ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన భార్యగా ఆమె అడుగుపెట్టాక ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఎత్తు-పల్లాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ అనంతరం ఆమె ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి ప్రజల్లోకి కూడా వెళ్లారు. అప్పటికే సీఎంగా - ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని ఎలా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది ? వీరి మధ్య లవ్ ఎలా పుట్టింది ? వీరిద్దరి గురించి ప్రపంచానికి తెలియని చాలా విషయాలకు తాజాగా లక్ష్మీపార్వతి సమాధానాలిచ్చారు.
తొలి పరిచయం అక్కడ...
తాజాగా లక్ష్మీపార్వతి ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వీటిల్లో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. తెలుగు ప్రజల హృదయాల్లో అన్నగా చెరగని ముద్ర వేయించుకున్న ఎన్టీఆర్ అన్నా - ఆయన సినిమాలు అన్నా తనకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పారు. గుంటూరులో ఉండగా తాను రోజుకు మూడు ఎన్టీఆర్ సినిమాలు చూసేదానని ఆమె తెలిపారు. ఇక 1989-1990 సంవత్సరాల్లో హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీలో ఏంఏ చదువుతుండగా తనకు ఎన్టీఆర్ పరిచయం అయినట్టు చెప్పిన ఆమె తాను చిన్నప్పుడు ఏ ఎన్టీఆర్ ను అయితే దేవుడిగా ఆరాధించేదానినో అదే కాలేజ్ రోజుల్లో మాత్రం ఓ ప్రేమికుడిగా భావించేదానినని చెప్పారు.
పర్ ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్....
ఎన్టీఆర్ ది పర్ ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ అని మెచ్చుకున్న లక్ష్మీపార్వతి పురాణాల్లో సాముద్రిక శాస్ర్తవేత్తలు చెప్పినదాని ప్రకారం ఆయన పురాణాల్లో రాముడి లాగే ఉండేవారని చెప్పారు. ఆయన కళ్లు - ముక్కు - ఎత్తు టోటల్ గా బాడీ మొత్తం చాలా పర్ ఫెక్ట్ గా ఉండేదని ఆమె ప్రశంసించారు. ఇక తాను ఎన్టీఆర్ ను మెట్టమెదటిసారిగా ఢిల్లీలో జరిగిన ఏపీ అవతరణ దినోత్సవాలకు హాజరైనప్పుడు కిషన్ రావు అనే అధికారం సాయంతో ఓ గదిలో కాషాయ వర్ణంతో సేద తీరుతున్న తన స్వామిని చూశానన్నారు. ఆ రోజు తాను ఎన్టీఆర్ కాళ్లకు నమస్కరిస్తే ఆయన తనను పైకిలేపి తన కన్నీళ్లు తుడిచారని నాటి జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారు.
కన్నీళ్లు తుడిచిన ఎన్టీఆర్....
ఎన్టీఆర్ తొలిసారి పార్టీ స్థాపించి తెనాలి వచ్చినప్పుడు ఎక్కడో జనాల్లో ఉండి ఆయన్ను చూసేందుకు ప్రయత్నించానని, ఇదే విషయాన్ని ఎన్టీఆర్ ను తొలిసారి కలిసినప్పుడు ఆయనకు చెప్పి కన్నీళ్లు పెట్టుకోగా ఆయనే స్వయంగా తన కన్నీళ్లు తుడిచారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇక టీడీపీ మహానాడులో ఎన్టీఆరే తనను స్వయంగా గుర్తుపట్టి లక్ష్మీ పార్వతి అంటూ పిలిచారని.. వెంటనే తాను ఆయన అపాయింట్ మెంట్ కోరగా మరుసటి రోజే తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారని ఆమె తెలిపారు.
ప్రేమ చిగురించింది ఇలా....
ఎన్టీఆర్ తో తాను చాలా సందర్భాల్లో కలుసుకుని చాలా విషయాలపై చర్చించేదానినని, తర్వాత ఎన్టీఆర్ బయోగ్రఫీ రాయడానికి తాను ఒప్పుకోవడం తన జీవితంలో మర్చిపోలేని రోజని ఆమె చెప్పారు. నరసారావుపేట డిగ్రీ కాలేజ్‌లో తాను పనిచేస్తున్న సమయంలో ప్రతి వారం ఎన్టీఆర్‌ను కలుసుకుని ఆయనతో పాటు గడపడం వల్ల ఇద్దరి మధ్య ఆత్మీయ అనుబంధం ఏర్పడిందని లక్ష్మీపార్వతి తెలిపారు. తర్వాత కాలక్రమంలో ఇద్దరి మధ్య ఒకరు విడిచి మరొకరం ఉండలేని పరిస్థితి వచ్చిందని...అప్పుడు ఎన్టీఆరే తనను వివాహం చేసుకుంటావా ? అని అడిగారని ఆమె తమ ప్రేమ విషయం చెప్పారు.
ప్రేమ కబుర్లకు ఫోన్ బిల్లు రూ 3.50 లక్షలు...
తామ మధ్య బంధం - అప్యాయత పెరిగినప్పుడు ఇద్దరి మధ్య ఫోన్ ద్వారా ఎక్కువ సంభాషణలు జరిగేవి అని చెప్పిన ఆమె.... ఆ రోజుల్లోనే తమ ప్రేమ కబుర్లకు రూ 3.50 లక్షల ఫోన్ బిల్లు వచ్చిందన్నారు. ఆ టైంలో ఎన్టీఆర్ ఓ రోజు తనతో మాట్లాడడానికి అయిన ఫోన్ బిల్లు స్లిప్‌ను తనకు చూపించారని అందులో బిల్లు మొత్తం అక్షరాలా రూ 3.50 లక్షలు ఉండడంతో తాను షాక్ అయ్యానన్నారు. తమ మధ్య ప్రేమ కొనసాగుతున్న టైంలో ఫోన్ లేకుండా రోజు గడిచేది కాదన్నారు.
రహస్య వివాహం జరిగిందిలా...
తమ ఇద్దరి మధ్య ప్రేమ జోరుగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పెళ్లి ప్రతిపాదన తెచ్చినప్పుడు తనకు కొడుకు ఉన్న విషయాన్ని, తన కుటుంబ సమస్యలను ఆయనతో చెప్పగా ఆయన ఎంతో సహృదయంతో తనను అర్థం చేసుకున్నట్టు లక్ష్మీపార్వతి చెప్పారు. 1992లోనే ఎన్టీఆర్‌కు తనకు రహస్య వివాహం జరిగినా తర్వాత తమను ఇబ్బంది పెట్టేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఎన్టీఆర్ నుంచి తనను వేరు చేసేందుకు ఎన్టీఆర్ ఫ్యామిలీ తనను కిడ్నాప్ కూడా చేయించిందని...చివరకు తిరుపతిలో మోహన్‌బాబు సినిమా ఫంక్షన్ సాక్షిగా ఎన్టీఆర్ తనను తన భార్యగా అందరికి పరిచయం చేశారని, అప్పటి నుంచి తాను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేకుండా పోయిందని ఆమె తెలిపారు. ఇక ఎన్టీఆర్‌తో కలిసి ఉండడమే తనకు పెద్ద హనీమూన్ అని ఆమె నవ్వుతూ తెలిపారు.
ఏదేమైనా దివంగత మాజీ సీఎం - టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గురించి, ఆయనతో తనకు ఉన్న అనుబంధం, వారిద్దరి కలయిక - ప్రేమ - వివాహం గురించి ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని చాలా విషయాలను లక్ష్మీపార్వతి తాజాగా వెల్లడించడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.