Begin typing your search above and press return to search.
రామోజీ చరిత్రపై రచ్చ చేస్తానంటున్న ఆమె..
By: Tupaki Desk | 18 Feb 2017 6:29 AM GMTతమిళనాడులో ఇప్పుడున్న రాజకీయ అనిశ్చితి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఏర్పడింది. తెలుగు దేశం పార్టీని చంద్రబాబు నిలువునా చీల్చినప్పుడు ఆయన బలం ఏమంత లేకపోయినా ఆయన్ను సీఎం చేసిన విధానం.. అప్పుడు జరిగిన పరిణామాలు రాజకీయవర్గాల్లో చాలామందికి తెలుసు. అయితే.. సామాన్యజనంలో ఆ గుట్టుమట్లు తెలిసినవారు చాలా తక్కువ. అన్నీ చంద్రబాబు తొత్తు మీడియాలే కావడంతో అప్పటి వెన్నుపోటు గురించి అసలు నిజాలు జనానికి పూర్తిగా తెలియదు. కానీ.. అప్పటి పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి అయిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి అంతా తెలుసు. చంద్రబాబుకు ఏమాత్రం బలం లేకపోయినా తన పత్రికలో చంద్రబాబుకు అనుకూలంగా అహో ఒహో అని రాసి సీఎం చేసేలా ఈనాడు గ్రూపుల రామోజీ రావు చక్రం తిప్పారని లక్ష్మీపార్వతి ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు వెంట తొలుత చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఏకంగా 130 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు వెంట ఉన్నారని ఈనాడు పత్రిక పనిగట్టుకుని కథనాలు రాసిందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తాను తప్ప మిగిలిన వారంతా చంద్రబాబు వద్దకు చేరిపోయారేమోనన్న ఆందోళనతో వైస్రాయ్ హోటల్ లో చేరిపోయారని చెబుతుంటారు. ఎన్టీఆర్ ను దెబ్బకొట్టేందుకు లక్ష్మీపార్వతిపైనా అనేక కథనాలు రాసింది ఈనాడు. ఒకవిధంగా లక్ష్మీపార్వతిని రాజ్యాంగేతర శక్తిగా చూపి ఎన్టీఆర్‌ను గద్దె దింపేశారు. ఈ సంగతులన్నీ బయటపెడతానని లక్ష్మీపార్వతి అంటున్నారు. తాజాగా ఒక టీవీ ఛానల్ లో చర్చలో పాల్గొన్న లక్ష్మీపార్వతి… రామోజీ రావుపై తాను పుస్తకం రాసినట్టు వెల్లడించారు. ఆ పుస్తకం త్వరలోనే విడుదలవుతుందన్నారు. రామోజీరావు సంగతులన్నీ అందులో ఉంటాయన్నారు.
అంతేకాదు.. ఎన్టీఆర్ పై రామోజీ ఎందుకు కక్ష కట్టారన్నది కూడా లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. 1989లో రామోజీ ఫిల్మ్ సిటీ కోసం 500 ఎకరాలు ఇవ్వాలని రామోజీ కోరారని అందుకు ఎన్టీఆర్ అంగీకరించలేదని లక్ష్మీపార్వతి చెప్పారు. అప్పటి నుంచి ఎన్టీఆర్‌పై కక్ష కట్టి రామోజీ రావు కథనాలు రాశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఉదయం పత్రిక మూసివేతలో రామోజీ పాత్రేమిటి.. మార్గదర్శి చిట్స్ గురించి అన్ని విషయాలతో పుస్తకం రాసినట్లు లక్ష్మీపార్వతి చెప్పారు. ఆ పుస్తకం కనుక బయటకొస్తే సెన్సేషనే మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/