Begin typing your search above and press return to search.

కోటి ఆరోపణలు ఒక కుట్ర - హైకోర్టులో లక్ష్మీపార్వతి పిటిషను

By:  Tupaki Desk   |   30 Jun 2019 1:38 PM GMT
కోటి ఆరోపణలు ఒక కుట్ర - హైకోర్టులో లక్ష్మీపార్వతి పిటిషను
X
వైసీపీ నేత - ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి హైకోర్టు మెట్లు ఎక్కారు. తనపై లైంగిక వేధింపుల కేసులో తాను నిర్దోషురాలిని అని - తన ఫోనును తస్కరించి కోటి అనే వ్యక్తి తన ఫోనుకు మెసేజులు పంపుకుని నామీదే తిరిగి ఆరోపణలు చేసినట్టు ఆమె కోర్టులో వేసిన పిటిషనులో పేర్కొంది. తన కేసును సీఐడీ ద్వారా గాని, సీబీఐ ద్వారా గాని దర్యాప్తు చేయించాలని కోరారు.

కుట్ర పూరితంగా తనను ఇరికించడానికి తెలుగుదేశం నేతలతో పాటు కొందరు మీడియా వాళ్లు కలసి చేసిన కుట్రగా ఆమె అభివర్ణించారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషను వేయడంతో పాటు హైదరాబాదు సైబర్ క్రైం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిందన్నారు. ఇందులో అప్పటి డీజీపీ ఠాకూర్‌ - ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, టీవీ5 మూర్తి - ఏబీఎన్ రాధాకృష్ణలను కూడా ఆమె ప్రతివాదులుగా పేర్కొంది. వారందరి కలిసి చేసిన కుట్రకు చంద్రబాబు మార్గదర్శనం చేశారని, దీనిపై సీబీఐ చేత గాని, సీఐడీ చేత గాని విచారణ జరిపించాలని ఆమె కోరారు.

సైబర్ క్రైం పోలీసుల విచారణలో రెండు ఫోన్లు ఒకే టవర్లో ఉన్నట్టు తేలిందని, తన ఫోను వాడుకుని కోటి ఈ మెసేజులు పంపాడు అనడానికి ఇదే ఆధారం అని లక్ష్మీపార్వతి వాదిస్తున్నారు. రేపు హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఆమె మెసేజులు పంపిన, చేరిన టవర్ హైదరాబాదులో ఉంది కాబట్టి వినుకొండ పోలీసులు దీనిపై దర్యాప్తు చేయడాన్ని ఆపాలని లక్ష్మీపార్వతి ఫిర్యాదులో పేర్కొన్నారు.