Begin typing your search above and press return to search.

నా మనవడికి 'మంగళగిరి' అనటం కూడా రాదు

By:  Tupaki Desk   |   3 April 2019 1:33 PM GMT
నా మనవడికి మంగళగిరి అనటం కూడా రాదు
X
సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్న లీడర్ లలో అందరికంటే ముందు వరుసలో ఉంటాడు టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్‌. అవగాహన రాహిత్యం కొంత అయితే.. ముందుగా మాట్లాడాలనుకున్న దానిపై సరిగ్గా ప్రిపేర్‌ కాకపోవడంతో లోకేష్‌ తప్పులు మీద తప్పులు చేస్తున్నాడు. దీంతో.. ప్రతిపక్షాలకు అతిపెద్ద అస్త్రంగా మారాడు లోకేష్‌. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌తో పాటు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతీ ఒక్కరూ లోకేష్‌ ను ఓ ఆట ఆడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌ లోకి లక్ష్మీపార్వతి కూడా చేరారు.

లోకేష్‌ కు లక్ష్మీ పార్వతి వరుసకు అమ్మమ్మ అవుతారు. దీంతో తన మనవడికి మంగళగిరి అని పలకడం రాక మందళగిరి అని పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు లక్ష్మీ పార్వతి. తాను మంగళగిరిని చాలా స్పష్టంగా పలుకుతున్నానని పలికి చూపించారు. మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆర్కే తరపున ఇవాళ ప్రచారం నిర్వహించారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబు నాయుడు 60 లక్షలు ఖర్చుపెడితే.. లోకేష్‌ కు ఒక డిగ్రీ వచ్చిందని.. ఇప్పుడు తెలుగుభాషని సరిగ్గా ఉచ్చరించడానికి 10 లక్షలు ఖర్చుపెడుతున్నారని విమర్శించారు. కనీస జ్ఞానం లేని వ్యక్తి తన మనవడు నారా లోకేష్‌ అని, ఏపీకి ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేష్‌ ని నిలబెట్టాడని ఆరోపించారు.

లోకేష్‌ ని ఎక్కడ నిలబెట్టాలో అర్ధం కాక చివరికి సింహం లాంటి ఆర్కేకు ప్రత్యర్థిగా నిలబెట్టారని అన్నారు. ఆర్కేకి సింహంలా పోరాడడమే వచ్చు కానీ గుంటనక్కల్లా రాజకీయం చేయడం తెలియదని అన్నారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబు నాయుడికి మతిమరుపు వ్యాధి వచ్చిందని, అందుకే కాసేపు ప్యాకేజీ కావాలంటాడు, కాసేపు ప్రత్యేక హోదా అంటాడని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మతిమరుపుతో ఎన్నికలు అయిపోగానే మరిచిపోతాడని వ్యాఖ్యానించారు. ఎన్నికలు పూర్తైన తర్వాత తండ్రీకొడుకులు ఇద్దరూ సింగపూర్‌ పారిపోవాల్సిందేనని విమర్శించారు లక్ష్మీ పార్వతి. మొత్తానికి లోకేష్‌ని అడ్డం పెట్టుకుని చంద్రబాబుని టార్గెట్‌ చేస్తున్నారు వైసీపీ నాయకులు.