Begin typing your search above and press return to search.
నువ్వు ఆ పని చేయగలవా .. పవన్ పై లక్ష్మి పార్వతి షాకింగ్ కామెంట్స్ ..
By: Tupaki Desk | 29 Sep 2021 12:30 PM GMTరస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం హాట్ హాట్ గా సాగుతుంది. అలాగే ఏపీ రాజకీయం మొత్తం సినిమా ఇండస్ట్రీ చుట్టూనే తిరుగుతుంది. సినిమా టికెట్స్ పై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ లో ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ తరవాత మొదలైంది అసలు రాజకీయం. ఏపీ ప్రభుత్వం పై , సీఎం జగన్ పై చేసిన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులు.
తాజాగా ఏపీ తెలుగు,సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ సొంతంగా ప్రజల్లోకి వెళితే తప్ప నాయకుడు కాలేరని, ఆయన విష వృక్షం నీడలో ఉన్నారని వెల్లడించారు. అక్కడి నుంచి బయటకు వస్తే తప్ప ముందుకు వెళ్లలేరని చెప్పారు. పది అడుగుల పాదయాత్ర చేసి, జనం ఎక్కువగా కనిపిస్తే కారు ఎక్కే పవన్, జగన్ మాదిరిగా ప్రజల్లో ఉంటూ సుదీర్ఘ పాదయాత్ర చేయగలరా అని ప్రశ్నించారు. అసలు పవన్ తాను ఏ సిద్దాంతం ఎన్నుకున్నారో ఆయనకే స్పష్టత లేదన్నారు. కమ్యూనిస్టులు, టీడీపీలతో కలిసి పనిచేసిన వ్యక్తి, టీడీపీ చేసిన తప్పులను ఎత్తి చూపలేకపోవడం ఏంటని ప్రశ్నించారు.
ప్రభుత్వం సినీ పెద్దలతో చర్చించిన తర్వాతే ఆన్ లైన్ టికెట్ల ప్రక్రియపై నిర్ణయం తీసుకుందన్నారు. ఒక నాయకుడిగా ముందుకు వెళ్లాలనుకుంటున్న పవన్, దొంగ టికెట్ల అమ్మకాలకు మద్దతుగా నిలిస్తే లీడర్ ఎలా అవుతారని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. నాయకులు అయిన వాళ్లు మంచి వైపు నిలబడాలని, జగన్ ప్రభుత్వం ఏం తప్పు చేసిందని ఆయన మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం మానుకోవాలని హితవు పలికారు. జగన్ కు ప్రజల మద్దతు ఉందని ఆయన జోలికి ఎవరూ రాలేరని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వరుస విజయాలు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు.ప్పుడూ బయటకే రాని పోసాని భార్యను కూడా అవమానించడం అంటే ఏ స్థితికి పవన్ కల్యాణ్ దిగజారాడో అర్థం అవుతుందని నిప్పులు చెరిగారు లక్ష్మీ పార్వతి.
రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు పవన్ కు మద్దతుగా వుంటే, మరికొందరు మాత్రం సైలెంట్‌గా వున్నారు. కానీ పోసాని కృష్ణమురళీ మాత్రం, రియాక్ట్ అయ్యారు. తన అభిమాన నాయకుడు జగన్ ను పవన్ అనరాని మాటలు అన్నారంటూ మీడియా ముందుకు వచ్చారు. నిన్న పవన్ పై పోసాని వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసానిపై పవన్ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణమురళీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
పవన్ కల్యాణ్ పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారని, వారంతా సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన ఫోన్‌కు వేలాది మెసేజీలు అందుతున్నాయని, బూతులు తిడుతున్నారని చెప్పారు. గ్యాప్ లేకుండా మెసేజీలు పంపిస్తున్నారని పోసాని అన్నారు. కుటుంబ సభ్యుల జోలికి వెళ్లొద్దంటూ పవన్ కల్యాణ్, ప్రెస్ మీట్ పెట్టి తన అభిమానులకు పవన్ కల్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వకపోతే తానూ కుటుంబ సభ్యుల జోలికి వెళ్తానని అన్నారు.