Begin typing your search above and press return to search.
అల్లుడి గురించి అత్త లక్ష్మీ పార్వతి చెప్పింది వినాల్సిందే
By: Tupaki Desk | 9 July 2017 8:23 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురించి కొందరు మాట్లాడితే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. వారు చెప్పినంత బాగా మరెవరూ చెప్పలేరేమో అన్నట్లుగా ఉంటాయి. బాబు మీద సటైర్లు వేస్తూనే.. ఘాటు విమర్శలు చేయటంలో స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి తర్వాతే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. బాబు తీరును ఆమె ఎద్దేవా చేసిన తీరు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి.
అల్లుడి గురించి చెప్పాలంటే అత్తే చెప్పాలని.. తన భర్త ఎన్టీఆర్ తోనే చంద్రబాబు హత్యా రాజకీయాలు ప్రారంభించారని చెప్పారు. వంగవీటి రంగా హత్య కేసులో బాబు పాత్ర ఉందని ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ మరణంపైనా తనకు సందేహాలు ఉన్నాయని చెప్పిన ఆమె.. ఆయన మరణంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు.
కాపు ఉద్యమాన్ని అణచివేయాలని కుట్ర చేస్తున్నారని.. ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పొట్టన పెట్టుకున్న ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డ ఆమె.. చంద్రబాబు అన్యాయానికి బలైన తనను తల్లిలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదరించిందన్నారు.
ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి వైఎస్ అని.. ఆయన మరణవార్త విని తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నారు. వైఎస్ భౌతికంగా లేకున్నా.. అందరి మనసుల్లో మాత్రం ఆయన శాశ్వితంగా ఉండిపోయారన్నారు. తాను వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే అలిపిరి ప్రమాదం నుంచి బయటపడ్డానని చంద్రబాబు ఒక సభలో చెప్పారన్న ఆమె.. వేంకటేశ్వరస్వామి ఓ భక్తుడి కలలో కనిపించి.. అనేక పాపాలు చేసిన చంద్రబాబు తన సన్నిధిలో చనిపోతే.. తనకు చెడ్డపేరు వస్తుందనే అతడ్ని ప్రాణాలతో బయటపడేలా చేశానని చెప్పినట్లుగా చెప్పారు.
బాబుది దుష్టపాలన అని.. ఆయన పాలనలో ప్రజలకు సుఖశాంతులు ఉండవని ధ్వజమెత్తారు. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ కరువేనని ఎద్దేవా చేశారు. బాబు చేసిన పాపాలకు ఆయన కుమారుడు లోకేశ్ రూపంలో ఫలితాన్ని అనుభవిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పిన లక్ష్మీ పార్వతి.. బాబు దుష్టపాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.