Begin typing your search above and press return to search.
పుష్కరస్నానానికి బాబుకు లింక్ పెట్టిన లక్ష్మీపార్వతి
By: Tupaki Desk | 13 Aug 2016 4:42 AM GMTకృష్ణా పుష్కరాల సందర్భంగా పుణ్యస్నానాలతో పాటు రాజకీయ విమర్శలు కూడా సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్ టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తన పుష్కర స్నానం సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం పెద్దమునిగల్ పుష్కరఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నంత కాలం తాను ఆంధ్రప్రదేశ్ లో పుణ్యస్నానాలు ఆచరించనని చెప్పారు.
తనకు మొదటి నుండి తెలంగాణ అంటే ఎంతో అభిమానమని లక్ష్మీపార్వతి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం తాను ఏపీలో పుణ్యస్నానాలను ఆచరించవద్దని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అందుకే గోదావరి పుష్కరాల్లో సైతం భద్రాచలంలో గోదావరి స్నానం ఆచరించానని చెప్పారు. చందంపేట మండలం పెద్దమునిగల్ వద్ద ప్రశాంత వాతావరణం ఉంటుందన్న సమాచారంతోనే తన సోదరితో తాను ఇక్కడికి వచ్చానని లక్ష్మీపార్వతి చెప్పారు. ఇదిలాఉండగా లక్ష్మీపార్వతితో కలిసి ఫోటోలు దిగేందుకు పలువురు మహిళా ఉద్యోగినులు ఆసక్తి కనబర్చడం విశేషం.