Begin typing your search above and press return to search.
లక్ష్మీపార్వతికి కోపం వచ్చింది.. ఎందుకంటే?
By: Tupaki Desk | 28 May 2019 5:27 AM GMTఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి కోపం వచ్చేసింది. సహజంగా గుస్సాను ప్రదర్శించని ఆమెకు.. ఈ రోజు మాత్రం రోటీన్ కు భిన్నంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ 96వ జయంతిని పురస్కరించుకొని వేడుకల్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
ప్రముఖ సినీ నటుడు తారక్.. ఈ రోజు (మంగళవారం) ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించారు. తాజాగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా నివాళులు అర్పించారు. తాజాగా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు. ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన ఆమె.. ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జయంతి సందర్భంగా చేసిన ఏర్పాట్లు సరిగా లేవన్నారు. కనీసం ఒక బ్యానర్ కూడా ఏర్పాటు చేయకపోవటాన్ని తప్పు పట్టారు.
చంద్రబాబు చేసిన కుట్రల కారణంగా తగిన శాస్తి జరిగిందనన ఆమె.. తాను తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. తాను కేవలం చంద్రబాబు అనే వ్యక్తికి మాత్రమే వ్యతిరేకమని.. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని జగన్ సరిదిద్దుతారన్నారు. తనకా నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతున్న వేళ.. ఆమెను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.