Begin typing your search above and press return to search.
జూ.ఎన్టీఆర్ ను లక్ష్మీపార్వతి అంత మాట అనేశారా?
By: Tupaki Desk | 8 Jun 2016 7:06 AM GMT ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్ ను స్మరించకుంటూ ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ తాజాగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే.. అంతా బాగున్నా.. ఆ సందర్భంగా ఆమె జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్లు విమర్శలకు దారి తీస్తున్నాయి. అచ్చుగుద్దినట్లు పెద్ద ఎన్టీఆర్ లానే ఉంటాడని తారక్ (జూ.ఎన్టీఆర్)ను అంతా అంటారు. అభిమానులూ అదే చెబుతారు. అయితే.. లక్ష్మీపార్వతి మాత్రం ఈ విషయంలో విభేధించారు. పెద్ద ఎన్టీఆర్ తో జూ.ఎన్టీఆర్ కు పోలికేంటన్నట్లుగా మాట్లాడారు. ముఖంలో పోలికలు కొంతవరకు ఉన్నా కూడా రూపంలో ఇద్దరి మధ్య చాలా తేడా ఉందని ఆమె చెప్పారు. ముఖ్యంగా ఇద్దరి మధ్య తేడా ఎత్తు అని చెబుతూ జూ.ఎన్టీఆర్ ను ఎగతాళి చేసేలా వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎన్టీఆర్ ఆరడుగుల ఆజానుబాహుడైతే జూ.ఎన్టీఆర్ అరజానెడే ఉంటారని ఆమె వ్యాఖ్యానించారు. ఇద్దరి ఫొటోలను పక్కపక్కన పెడితే ఆ తేడా తెలుస్తుందని.. జూనియర్ అరజానబాహుడని ఆమె వ్యాఖ్యానించారు.
అదొక్కటే కాకుండా నటనలోనూ ఎన్టీఆర్ కు ఎవరూ సాటిరారని తేల్చేశారు. అసలు ఎన్టీఆర్ కు నటనలో వారసులెవరూ లేరని అనేశారు. దీంతో లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలపై జూ.ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీవ్రమైన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అభిమానులు, సాధారణ ప్రజలు కూడా అంగీకరించే నిజాన్ని లక్ష్మీపార్వతి తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు.
అయితే.. లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఆయన సన్నిహితులు కానీ ఇంతవరకు స్పందించలేదు. లక్ష్మీపార్వతి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినా సంయమనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి చంద్రబాబును, ఎన్టీఆర్ మిగతా కుటుంబాన్ని విమర్శించే ఆమె గతంలో ఎన్నడూ ఇలా జూనియర్ ఎన్టీఆర్ ను విమర్శించిన దాఖలాలు లేవు. ఈ స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భమూ లేదు. ఇలా జూనియర్ ను ఎగతాళి చేస్తూ ఆమె మాట్లాడడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.