Begin typing your search above and press return to search.

వెన్నుపోటుకి పాతికేళ్లు..లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   22 May 2020 2:00 PM GMT
వెన్నుపోటుకి పాతికేళ్లు..లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు!
X
ఏపీలో ఒకవైపు వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతుంటే... రాజకీయం కూడా రోజురోజుకి మరింత హీటెక్కుతోంది. అధికార పక్షం - విపక్ష సభ్యుల ఆరోపణలతో రాష్ట్రంలో రాజకీయం మంచి రసవత్తకరంగా మారింది. ఇలాంటి తరుణంలో అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే అంటూ వైసీపీ అధికార ప్రతినిధి - తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీపార్వతి పలు కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని సీఎం జగన్ నిరవేర్చారు అని జగన్ పై ప్రశంసలు కురిపించారు.

దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్‌ పాలన చూసి - పొగడ్తలు కురిపిస్తున్నారు. పార్టీలకు అతీతంగా జగన్‌ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు పై రెచ్చిపోయారు - చంద్రబాబును ఏపీ ప్రజలు మర్చిపోయి చాలా రోజులు అవుతుంది అని - అయన సేవలు రాష్ట్రానికి అవసరం లేదు అని అన్నారు. ఎన్టీఆర్‌ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 25 ఏళ్లు గడిచాయని తెలిపారు.

చంద్రబాబు జూమ్‌ నాయుడుగా మారిపోయారని నీచ రాజకీయాలకు రంగనాయకమ్మ - డాక్టర్‌ సుధాకర్‌ బలయ్యారని - డాక్టర్‌ సుధాకర్‌ టీడీపీ సానుభూతి పరుడని - టీడీపీ ఎమ్మెల్యే సీటు కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. రంగనాయకమ్మ టీడీపీకి అనుకూలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు.టీడీపీ సానుభూతి పరురాలిని పట్టుకుని ఎల్లో మీడియా సామాజిక కార్యకర్తని చేసిందని దుయ్యబట్టారు.

66 ఏళ్ల మహిళపై కేసు పెట్టారంటూ గగ్గోలు పెట్టారని - ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెట్టరా? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. 60 ఏళ్ల మహిళ అయిన తనపై టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని - ఎన్టీఆర్‌ భార్య అయిన తనను ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు కోటి అనే వ్యక్తికి రూ. 25 లక్షలు ఇచ్చి తనపై టీవీ5 చానెల్‌ లో డిబేట్‌ పెట్టినప్పుడు మహిళ సంఘాల నేతలు ఏమయ్యాయని - అప్పుడు ఎవరు నోరుమెదపలేదు అని - ఇప్పుడు ఎందుకు కుక్కల్లాగా మొరుగుతున్నారని ఫైర్ అయ్యారు.