Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు లక్ష్మీ పార్వతి సలహా విన్నారా?
By: Tupaki Desk | 6 March 2018 7:51 AM GMTఅనుభం అన్నది మార్కెట్లో దొరికే వస్తువ ఎంతమాత్రం కాదు. ఎన్ని కోట్ల రూపాయిలు ఖర్చు చేసినా అనుభవం అందుబాటులోకి రాదు. ఒక మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ మార్గంలో వెళితే వచ్చే ఇబ్బందులు ఏమిటన్నది.. ఆ మార్గంలో అంతకు ముందే నడిచిన వారిని అడిగితే అనుభవ పూర్వకంగా సమాధానాలు చెబుతారు. ఇప్పుడు అలాంటి సూచనలే చేస్తున్నారు ఎన్టీవోడి సతీమణి లక్ష్మీపార్వతి.
దేశ రాజకీయాల్ని చక్రం తిప్పటమేకాదు.. భిన్న ధ్రువాల్ని ఒకచోటకు చేర్చిన ఘనత ఎన్టీవోడిదే. కాంగ్రెస్.. బీజేపీయేతర ఫ్రంట్ కలను సాకారం చేయటమే కాదు.. పవర్ లోకి వచ్చేలా చేసిన సత్తా ఎన్టీవోడిదే. ఆ సందర్భంగా ఎన్టీవోడితోనే ఉన్నారు లక్ష్మీపార్వతి. దేశ రాజకీయాలు ఎలా ఉంటాయి? ప్రాంతీయ నాయకుల మనస్తత్వం ఎలా ఉంటుంది? వారిలో ఇగోలు ఏ స్థాయిలో ఉంటాయి? లాంటివి ఆమెకు బాగానే సుపరిచితం.
కేంద్రంలో కొత్త ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టిన వేళ.. ఆమె అనుభవపూర్వకంగా కొన్ని సలహాల్ని ఇచ్చారు. మూడో ఫ్రంట్ ను తెర మీదకు తీసుకొచ్చి... రానున్న రోజుల్లో బీజేపీ.. కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేయనున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి స్పందించారు. రాష్ట్రాన్ని గాడిలోకి పెట్టిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం కేసీఆర్ పెడితే మంచిదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె అన్నారంటే
+ ప్రాంతీయ పార్టీల నేతల మధ్య ఎవరు గొప్ప అనే కారణంతో మూడో ఫ్రంట్ విచ్ఛిన్నమైన సందర్భాలు ఉన్నాయి.
+ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తగా గాడిలో పెట్టిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెడితే ప్రయోజనం.
+ జాతీయ రాజకీయాల్లో దృష్టి పెట్టటం బాగానే ఉన్నా.. గతంలో వచ్చిన మూడో ఫ్రంట్ ఎందుకు గద్దె దిగాల్సి వచ్చిందనేది మర్చిపోకూడదు.
+ తెలంగాణ రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చిన తర్వాతే దేశ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది.
+ నేషనల్ ఫ్రంట్ హయాంలో వీపీ సింగ్ ను ప్రధానిగా పని చేశారు. అయితే.. ప్రాంతీయ పార్టీల అధినేతల మధ్య నెలకొన్న వ్యక్తిగత ఈగోల కారణంగా కూటమి చీలిపోయింది.
+ మూడో ఫ్రంట్ లో జాతీయపార్టీలు లేకపోతే ప్రాంతీయ పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటు కష్టమవుతుంది.
+ ప్రాంతీయపార్టీల నేతల్ని సమన్వయం చేయటం తలకు మించిన భారం అవుతుంది.