Begin typing your search above and press return to search.
అగ్రిగోల్డ్ లో బాబు లెక్క చెప్పిన లక్ష్మీ పార్వతి
By: Tupaki Desk | 16 Jun 2016 9:39 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద దివంగత ఎన్టీఆర్ సతీమణి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు. లక్షలాది మందికి టోపీ పెట్టిన అగ్రిగోల్డ్ ఇష్యూలో బాబుకు లింకుపెట్టారు. అగ్రిగోల్డ్ బాధితులు నిర్వహిస్తున్న నిరసన సభలో మాట్లాడిన లక్ష్మీపార్వతి ఏపీ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కోర్టులో కేసు నడుస్తుండగా మంత్రులు భూమి కొనటం సిగ్గు చేటన్న ఆమె.. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబుకు రూ.200 కోట్ల ముడుపులు ముట్టినట్లుగా ఆరోపణలు చేశారు.
ప్రజా ధనాన్ని చంద్రబాబు నీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారన్న ఆమె.. వాస్తు.. గెస్ట్ హౌస్.. సెవెన్ స్టార్ హోటళ్లకు రూ.100 కోట్ల ప్రజాధానాన్ని ఖర్చు చేశారన్న ఆమె.. అగ్రిగోల్డ్ ఉదంతంలో 40 లక్షల మంది బాధితులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. వేలాది కోట్ల రూపాయిల అవినీతికి పాల్పడిన చంద్రబాబు.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదని.. కనీసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై చంద్రబాబు మీద విమర్శలు వచ్చినా.. నేరుగా ఆయనపై ముడుపుల ఆరోపణలు రావటం ఆయనకేమాత్రం మంచిది కాదు. ఇలాంటి ఆరోపణలు ఆయన పరపతిని దెబ్బ తీస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పటికైనా అగ్రిగోల్డ్ వ్యవహారంపై బాబు సర్కారు కఠినంగా వ్యవహరించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది.