Begin typing your search above and press return to search.
బాబుకు దిమ్మ తిరిగే సవాలు విసిరిన లక్ష్మీపార్వతి!
By: Tupaki Desk | 24 Aug 2018 10:19 AM GMTతెలుగుదేశంపై ఎప్పుడు లోతుగా చర్చ జరిగినా.. చంద్రబాబును వేలెత్తి చూపించే పరిస్థితి ఉంటుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ.. కాంగ్రెస్ పార్టీ లమధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ..దివంగత నేత ఎన్టీఆర్ సతీమణి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ఇద్దరు తమకు తాముగా సొంతంగా పార్టీని పెట్టి.. ఈ రోజున ఆ పార్టీలను ఇంత స్థాయికి తీసుకొచ్చారని.. మరి.. అలానే చంద్రబాబు టీడీపీని వదిలిపెట్టి.. కొత్త పార్టీని పెట్టి.. ఈ స్థాయికి తేగలరా? అన్న సూటి సవాలును సంధిస్తున్నారు.
బాబుకు దమ్ముంటే.. టీడీపీని వదిలిపెట్టి.. పార్టీ పగ్గాల్ని బాలకృష్ణకో.. నందమూరి జూనియర్ ఎన్టీఆర్ కో అప్పగించాలని.. బాబు తన సొంత పార్టీని ఏర్పాటు చేసి ఈ స్థాయికి తేగలరా? అని ప్రశ్నించారు. లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో ఆసక్తికరచర్చ జరుగుతోంది. టీడీపీని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పాటు చేశారు.
మరి.. అలాంటి పార్టీని ఈ రోజున కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన రావటం తప్పుగా చెబుతున్నారు. టీడీపీకి ఉన్న బలమైన పునాదుల కారణంగా పార్టీ నిలబడిందని.. అంతే తప్పించి చంద్రబాబు గొప్పతనం ఏమీ లేదంటున్నారు. వెన్నుపోటు రాజకీయాలతో ఎన్టీఆర్ ను గద్దె దించి అధికారాన్ని తన సొంతం చేసుకున్నారని.. అలాంటి పార్టీని ఈ రోజున కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే నిర్ణయం తీసుకుంటే.. ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడున్నా ఘోషిస్తుందన్నారు. అందుకే.. టీడీపీని వదిలేసి.. బాబు సొంతంగా తన పార్టీని పెట్టుకొని అధికారం కోసం పోరాడాలన్న పిలుపును ఇచ్చారు లక్ష్మీపార్వతి. మొత్తానికి బాబుకు ఎన్టీఆర్ సతీమణి పెట్టిన పిట్టింగ్ తో టీడీపీ అధినేత ఇరుకున పడేలా చేసిందని చెప్పక తప్పదు.