Begin typing your search above and press return to search.

లక్ష్మీపార్వతిలో ఎన్టీఆర్ కు నచ్చింది అదేనట..

By:  Tupaki Desk   |   29 Aug 2019 10:53 AM IST
లక్ష్మీపార్వతిలో ఎన్టీఆర్ కు నచ్చింది అదేనట..
X
ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి.. తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జంట.. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన అన్నగారి రెండో భార్యగా లక్ష్మీపార్వతి చుట్టు అల్లుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.. అయితే లక్ష్మీపార్వతిలో ఏం చూసి ఎన్టీఆర్ ఈమెను వివాహం చేసుకున్నాడన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు.

తాజాగా లక్ష్మీపార్వతి ఈ విషయాన్ని రిలీవ్ చేశారు. తాను ఎన్టీఆర్ జీవిత కథను రాయడానికి ఆయనతో ఫోన్లో మాట్లాడడం.., పర్సనల్ గా కలిసినప్పుడు ప్రేమ పుట్టిందని.. తాను ఆయనపై చూపించిన అత్యధిక ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యం చూసే తనను పెళ్లి చేసుకుంటానని ఎన్టీఆర్ అడిగాడని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చింది.

అయితే అప్పటికే తాను విశ్వహిందూ పరిషత్ లతో బుర్ర - ఒగ్గు కథలు చెప్తూ కళలను పోషించే కళాకారిణిగా ఉండడం.. పైగా అప్పటికే వివాహం జరగడంతో ఎన్టీఆర్ పెళ్లి ప్రతిపాదనను మొదట అంగీకరించలేదని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. అయితే తన కళాపోషణకు ఎటువంటి అభ్యంతరం లేదని.. ముందులాగా పాల్గొనవచ్చని ఎన్టీఆర్ అభయం ఇవ్వడంతోనే తాను ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకున్నానని లక్ష్మీపార్వతి అసలు సీక్రెట్ బయటపెట్టారు.