Begin typing your search above and press return to search.
'లక్ష్మీస్ వీరగ్రంథం' పై లక్ష్మీ పార్వతి కామెంట్స్!
By: Tupaki Desk | 26 Oct 2017 10:36 AM GMTఒక పక్క తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కబోతుండగా, మరోపక్క వర్మ..లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సినిమా మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే, వీరిద్దరూ చాలదన్నట్లు తాజాగా 'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరుతో మరో బయోపిక్ తీయబోతున్నట్లు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో, ఎన్టీఆర్ పై ఏకకాలంలో మూడు బయోపిక్ లు రాబోతున్నాయి. అయితే, జగదీశ్వర్ రెడ్డి తీయబోతున్న బయోపిక్ పై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన పరువు ప్రతిష్టలను మంటగలిపేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితంపై సినిమా తీసేముందు తన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, లేకుంటే చూస్తూ ఊరుకోనని చెప్పారు. ఎన్టీఆర్ జీవితంలోని నిజాలను వక్రీకరించి సినిమా తీయాలని చూస్తే తాను కోర్టుకు వెళ్లడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మౌనదీక్ష చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
తన మనసుకు బాధ కలగడంతో సాంత్వన కోసం ఆయన సమాధి వద్దకు వచ్చానని లక్ష్మీ పార్వతి చెప్పారు. తన భర్త ఎన్టీఆర్ చివరి రోజుల్లో మానసిక క్షోభ అనుభవించారని, ఆయన మరణం వెనుక ఉన్న నిజాలను వెలికి తీయాలని తాను చాలాకాలంగా పోరాడుతున్నానని తెలిపారు. అయితే, హఠాత్తుగా కొంతమంది వచ్చి తనను రచ్చకీడ్చాలనే ఉద్దేశంతో ఉన్నవి, లేనికి కల్పించి సినిమాలు తీయాలని భావిస్తున్నారని ఆరోపించారు. తాను బ్రతికుండగా వారి ప్రయత్నాలు సాగవని, తన ప్రాణం అడ్డుపెట్టయినా వాటిని అడ్డుకుంటానని ఆమె అన్నారు. తన అనుమతి లేకుండా తన వ్యక్తిగత జీవితంపై సినిమా తీస్తే చూస్తూ ఊరుకోనన్నారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని కన్నీరు పెట్టుకున్నారు. తనను ఇబ్బంది పెట్టినా భరిస్తానని, అయితే, తన భర్త పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లితే మాత్రం చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిర్మించబోతున్న సినిమాకు తన అనుమతి తప్పనిసరని, అనుమతి లేకుండా తీసే చిత్రం చెల్లబోదని స్పష్టం చేశారు. ఇంతవరకు లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రానికి తన అనుమతి కోరుతూ ఎవరూ సంప్రదించలేదని లక్ష్మీ పార్వతి అన్నారు.