Begin typing your search above and press return to search.
''యువరాజు''కు విందు ఇచ్చాడట
By: Tupaki Desk | 5 July 2015 5:13 AM GMTఒకటి తర్వాత ఒకటిగా బాంబులు పేలుస్తూ.. ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలకు చెందిన పెద్ద తలకాయల్ని తన ఉచ్చులోకి లాగుతున్న మాజీ ఐపీఎల్ చీఫ్ లలిత్ మోడీ తాజాగా మరో బాంబు పేల్చారు.
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు.. యువరాజు రాహుల్‌గాంధీతో తనకు మాంచి సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని పేర్కొన్నారు.అధికార బీజేపీ.. విపక్ష కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతల్ని తరచూ ఇబ్బంది పెడుతూ వ్యాఖ్యలు చేసిన లలిత్.. తాజాగా రాహుల్‌గాంధీపై తన దృష్టి సారించారు.
తాజాగా ట్విట్టర్‌లో మరో ట్వీట్ చేసిన లలిత్ మోడీ.. కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ సైతం తన అతిధ్యం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఊరికే మాటలు చెప్పకుండా.. తానిచ్చిన అతిధ్యానికి హాజరైన రాహుల్‌గాంధీ ఉన్న ఫోటోల్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. రాహుల్‌కు తాను అతిధ్యం ఇచ్చినట్లుగా మాటలు.. సాక్ష్యంగా ఫోటోల్ని ట్వీట్ చేసిన లలిత్ మోడీ మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు.
''ఈ ఫోటో చూశాక.. తాను అతిధ్యం స్వీకరించలేదని రాహుల్ కానీ.. రాబర్ట్ కానీ చెప్పగలరా?'' అంటూ మొట్టికాయల మాదిరి మాటల్ని ప్రయోగించారు. బీజేపీ అగ్రనేతల్ని వివాదంలోకి లాగిన లలిత్‌మోడీ తాజాగా కాంగ్రెస్ యువరాజునే టార్గెట్ చేసిన నేపథ్యంలో.. ఫోటోల విషయంలో ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. చూస్తుంటే.. కాంగ్రెస్.. బీజేపీ రెండూ దొందూ.. దొందేనన్నట్లుగా ఉందే.