Begin typing your search above and press return to search.
రాహుల్.. ప్రియాంకలను కూడా లలిత్ కలిశాడంట
By: Tupaki Desk | 26 Jun 2015 8:18 AM GMTఐపీఎల్ మాజీ బాస్ విదేశాలకు వెళ్లేందుకు బీజేపీ అగ్రనేతలు సుష్మాస్వరాజ్.. వసుంధర రాజెలు సాయం చేశారన్న వార్తలపై జాతీయ ఛానళ్లలో హోరెత్తి పోతున్న సమయంలో అధికారపక్షం డిఫెన్స్‌లో పడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో.. అధికారపక్షానికి ఒక ఆయుధాన్ని ఇస్తూ.. తనకు బీజేపీ నేతలతోనే కాదు.. కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా చక్కటి సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని తెలియజేస్తూ.. లలిత్‌మోడీ తాజాగా ఒక బాంబు పేల్చారు.
ఏడాది కిందట తాను లండన్‌లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతోనూ.. సోనియాగాంధీ కుమార్తె.. అల్లుడు.. ప్రియాంక.. రాబర్ట్‌వాద్రాతో కూడా తాను భేటీ అయినట్లుగా తాజాగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ముగ్గురిని కలిసిన సమయంలో కేంద్రంలో యూపీఏ సర్కారే ఉందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తన ట్వీట్స్‌తో సాక్‌లు ఇస్తున్న లలిత్ మోడీ తాజాగా ఇచ్చిన ట్వీట్స్‌తో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడే పరిస్థితి.
లలిత్ పేరుతో బీజేపీ అగ్రనేతల రాజీనామాల కోసం డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్‌పార్టీకి ఈ పరిణామం కాస్త ఇబ్బంది పెట్టించేదే. అంతేకాదు.. తన గురించి.. తాను సమావేశం అయిన వారి వివరాలు వెల్లడిస్తున్న వారు.. ఈ ముగ్గురితో భేటీ అయిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించటం లేదని లలిత్‌మోడీ ప్రనశ్నిస్తున్నారు. తాను వారిని రెస్టారెంట్‌లో కలిసిన సమయంలో టిమ్మీ సర్నా కూడా ఉన్నారని.. అతడితో తనకు కాంటాక్ట్ ఉందని వెల్లడించారు. మరి.. తాజా ట్వీట్స్ నేపథ్యంలో కాంగ్రెష్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.