Begin typing your search above and press return to search.
బయోపిక్ లలో లాలూ బయోపిక్ వేరయా
By: Tupaki Desk | 31 Oct 2019 6:00 AM GMTలాలూ ..దేశ రాజకీయాలలో కీలకనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి. అసలు రాజకీయ నాయకులు ఇలా కూడా ఉంటారా అని లాలూని చేసేవరకు ఎవరికీ తెలియదు. మాములుగా రాజకీయ నాయకుల జీవితం అంటే .. ఉదయం లేచినప్పటినుండి .. సాయంత్రం పడుకునేవరకు క్షణం తీరిక లేని జీవితం ... తమ చుట్టూ ఉండే నౌకర్లు. వారి టీవీ అబ్బా అదో లెవెల్ అనుకోండి. కానీ , సీఎం గా ఉన్నప్పుడు కూడా లాలూ ఉదయాన్నే నోట్లో వేప పుల్ల వేసుకొని ..ఆవు పాలు పిండేవారు. మధ్యలో స్కాం లో చిక్కుకొని జైల్లో ఉన్నాడు అది వేరే విషయం అనుకోండి ..అబ్బో కామెడీ పంచ్‌ల నుంచి కారాగారం దాకా ఆయన జీవితంలో చాలా మలుపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో వెండితెరపై చూడబోతున్నాం..
బాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సంజయ్‌దత్, సానియా మీర్జా, కపిల్‌దేవ్ లతో పాటు పలువురు సినిమా తారల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి ఈ సమయంలోనే బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ బయోపిక్ ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే ‘లాంతర్’ అని పేరు పెట్టారు. లాలూ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్. ఆ పార్టీ గుర్తు లాంతర్. దీంతో ఆ గుర్తునే ఇప్పుడు లాలూ బయోపిక్‌కు కూడా పెట్టారు.
దాణా స్కామ్‌లో దోషిగా తేలిన లాలూ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆర్జేడీ పార్టీని కొడుకు తేజస్వి యాదవ్ చూస్తున్నారు. లాలూ క్యారెక్టర్ లో ప్రముఖ భోజ్‌పురి నటుడు యష్ కుమార్ నటిస్తున్నారు. లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి పాత్రలో స్మృతి సిన్హా నటించనున్నారు. లాలూ బయోపిక్‌ను బీహార్, గుజరాత్‌లో షూటింగ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.
స్టూడెంట్‌గా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన లాలూ . ఆ తర్వాత బీహార్ సీఎంగా ఎదిగారు. ఆర్జేడీ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 2010 వరకు రాజకీయాల్లో చక్రం తిప్పిన లాలూకి ఆతర్వాత కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన లాలూ ప్రసాద్ యాదవ్.. బీహార్ సీఎంగా ఎదిగిన వైనం, యాదవుల్లో లాలూకి ఉన్న ఫాలోయింగ్ ఈ తరం వారికి తెలియజెప్పేందుకే ఈ సినిమాను తీస్తున్నట్టు యష్ కుమార్ తెలిపారు.