Begin typing your search above and press return to search.
నాన్నకు ప్రేమతో.. లాలూ కూతురు చేసిన పనేంటో తెలుసా?
By: Tupaki Desk | 10 Nov 2022 10:30 AM GMTనాన్నకు ప్రేమతో ఎంతో మంది ఎన్నో విధాలుగా తమకు జన్మనిచ్చిన తండ్రికి ఎన్నో చేస్తుంటారు. మరికొంతమంది తమకు జన్మనిచ్చిన తండ్రిని అవసాన దశలో పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. అయితే తన తండ్రికి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డారు.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య.
ఇంతకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు రోహిణీ ఏం చేశారంటే.. గత కొన్నేళ్లుగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కిడ్నీ వ్యాధి, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తన కిడ్నీల్లో ఒకదాన్ని తన తండ్రికి దానం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
ఈ మేరకు సింగపూర్ ఆస్పత్రిలో లాలూప్రసాద్ యాదవ్‌కు చికిత్స చేయించగా.. వారు ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన కుమార్తె రోహిణి తన కిడ్నీని తన తండ్రికి దానం చేయడానికి ముందుకొచ్చింది.
అయితే ఇందుకు మొదట లాలూప్రసాద్ యాదవ్ అంగీకరించలేదట. అయితే రోహిణితోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో లాలూప్రసాద్ యాదవ్ అయిష్టంగానే అంగీకరించారట.
ఈ నేపథ్యంలో నవంబర్ 20–24 మధ్య మరోసారి లాలూ ప్రసాద్ యాదవ్.. సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ సమయంలోనే ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తారని చెబుతున్నారు. కాగా రోహిణీ ఆచార్య సింగపూర్‌లోనే నివాసముంటున్నారు.
లాలూప్రసాద్ యాదవ్‌కు సింగపూర్‌లో వైద్యం చేయించాలనే ఆలోచన కూడా రోహిణీ ఆచార్యదేనని చెబుతున్నారు. సింగపూర్‌లో చికిత్స తీసుకోకముందు లాలూప్రసాద్ యాదవ్ కొన్నాళ్లపాటు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.
మరోవైపు రోహిణీ ఆచార్య సింగపూర్‌లో ఉంటున్నప్పటికీ రాజకీయాల విషయంలో తండ్రికి తగ్గ తనయగానే ఉంటున్నారు. నిత్యం ఆమె మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బిహార్ రాజకీయ పరిణామాలను తెలుసుకుంటున్నారు.
సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రోహిణి తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అంతేకాకుండా ఆర్జేడీకి ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ తదితరాలపై తీవ్ర విమర్శలను ఎక్కుపెడుతున్నారు. ఇందుకోసం ఆమె సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. నాన్నకు ప్రేమతో ఓవైపు కిడ్నీ ఇస్తున్న రోహిణీ ఆచార్య మరోవైపు రాజకీయాల్లోనూ తండ్రికి తగ్గ తనయగా వ్యవహరిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.