Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలతో బేరం మాట్లాడుతున్న లాలూ

By:  Tupaki Desk   |   25 Nov 2020 2:00 PM GMT
ఎమ్మెల్యేలతో  బేరం మాట్లాడుతున్న లాలూ
X
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్నారు. పశుగ్రాసం కుంభకోణం కేసులో లాలూ యాదవ్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆయనకి ఓ కేసులో బెయిల్ లభించినప్పటికీ, మరో కేసులో బెయిల్ రాలేదు. దీనితో ఒక కేసులో బెయిల్ వచ్చినా రాంచీలోని సెంట్రల్ జైల్లో జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్య కారణాలపై ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే .. ఈ మద్యే జరిగిన బీహార్ ఎన్నికల్లో మరోసారి బఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఆర్జేడీ మెజారిటీ స్థానాలు గెలుపొందినప్పటికీ , కూటమిలోని ఇతర పార్టీలు అంతగా ప్రభావం చూపకపోవడంతో ఆర్జేడీ మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అయింది. నితీష్ కుమార్ సీఎం గా ఇప్పటికే ప్రమాణస్వీకారం కూడా చేశారు.

అయితే , రాజకీయాలని అవపోసన పట్టిన లాలూ ప్రసాద్ యాదవ్ ... బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆర్జేడీ అధికారంలోకి రావడానికి లాలూ కుట్ర పన్నుతున్నారని, ఎన్డీయే ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని సుశీల్ కుమార్ మోడీ ఆరోపించారు. మహాఘట్ బంధన్ కి పరోక్షంగా తోడ్పడుతున్నారని అంటూ ఇందుకు నిదర్శనంగా ఓ మొబైల్ నెంబరును కూడా ఆయన తన ట్విటర్ ద్వారా తెలిపారు. ఎన్డీయే ఎమ్మెల్యేలతో బేరసారాలాడుతున్నారని, మీకు మంత్రి పదవులు ఇస్తామంటూ ఆశ పెడుతున్నారని ఆయన అన్నారు. ఈ నెంబరుకు తాను ఫోన్ చేయగా ఏకంగా లాలూయే రిసీవ్ చేసుకున్నారని సుశీల్ మోడీ తెలిపారు.

అయితే , మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ చేసిన ఆరోపణలు నిజమే అని అన్నట్టుగా ఉండే లాలూ ప్రసాద్ యాదవ్ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా జరిగే ఓటింగ్ లో పాల్గొనవద్దంటూ లాలన్ పాశ్వాన్ అనే ఎమ్మెల్యేకు ఆయన సూచిస్తూ..ఇందుకు మీకు మంత్రి పదవి ఇస్తామని ప్రలోభ పెట్టారట.. ఆర్జేడీ అధికారంలోకి రాగానే ఈ పని చేస్తామని హామీ ఇచ్చారట. ఓటింగ్ లో పాల్గొనకపోవడం తనకు కష్టమని ఆ ఎమ్మెల్యేఅంటే, కరోనా సోకింది అని గైర్ హాజరు కావాలని లాలూ సలహా ఇఛ్చినట్టు ఈ వీడియోలో ఉన్న సంభాషణ. అయితే , లాలూ చేష్టలపై సుశీల్ మోడీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. జైల్లో ఉన్నప్పటికీ ఇలాంటి కుట్రలు ఆపడం లేదు , నితీష్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ఊరికే ఉండే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు.