Begin typing your search above and press return to search.
లాలూ ప్రసాద్ మరింత విషమం ..హాస్పిటల్ కి కుటుంబ సభ్యులు - ఐసీయూలో చికిత్స
By: Tupaki Desk | 22 Jan 2021 12:45 PM GMTఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికే చికిత్స తీసుకుంటున్న ఆయన, ప్రస్తుతం ఊపిరి తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లాలూకి ఇన్ఫెక్షన్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఆయనకు చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. లాలూకు కరోనా పరీక్షలను కూడా నిర్వహించామని, నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. అవినీతి కేసుల్లో ఆయన జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవలి కాలంలో ఆయన ఆరోగ్యం పలుమార్లు క్షీణించింది. దీంతో, ఆయన బెయిల్ కోసం కోర్టులో పిటిషన్లు కూడా వేశారు. కానీ, కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. అయన ఆరోగ్యం క్షణ క్షణానికి విషయమిస్తుండటంతో ఆయన కుమార్తె మీసా భారతి రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె భర్త, తల్లి రబ్రీ దేవి, కుమారులు తేజస్వీ యాదవ్ పాట్నా నుంచి హెలికాప్టర్ లో ఆస్పత్రికి చేరుకోనున్నారు.
లాలూ ప్రసాద్ ఆరోగ్యం గురించి ఎయిమ్స్‌లోని ఊపిరితిత్తుల విభాగ అధిపతిని సంప్రదించామని రిమ్స్ వైద్యులు తెలిపారు. అయితే ర్యాపిడ్ టెస్ట్‌లో కరోనా నెగటివ్ వచ్చిందని.. ఆర్టీ పీసీఆర్ పరీక్ష ఫలితం మాత్రం రేపు వస్తుందని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కమరేశ్వర్ ప్రసాద్ తెలిపారు.
లాలూ పరిస్థితి గురించి తెలుసుకున్న జైలు అధికారులు, ఝార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ సారథ్యంలోని వైద్య బృందం లాలూ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. లాలూ ఏదైనా నిర్దిష్ట అనారోగ్యానికి గురయ్యారా అని తెలుసుకోడానికి కిడ్నీ పనితీరును పరీక్షించామని వివరించారు. మూత్రపిండాలు, గుండె జబ్బు సహా వివిధ అనారోగ్యాలతో ఆయన బాధపడుతున్నందున వివిధ పరీక్షలను నిర్వహించాం.. ఫలితాలు సాధారణం కంటే ఎక్కువగానే ఉన్నాయని, ఆయన అనారోగ్యంతో ఉన్నాడు అని రిమ్స్ డైరెక్టర్ అన్నారు.