Begin typing your search above and press return to search.
అద్వానీకి దెబ్బేసేందుకు మోడీ కుట్ర?
By: Tupaki Desk | 19 April 2017 11:21 AM GMTతాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూసిన వెంటనే పలువురు మదిలో మెదిలిన సందేహంగా దీన్ని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం నాటి కేసుపై సీబీఐ ఉన్నట్లుండి యాక్టివ్ కావటం ఏమిటి? సుప్రీంకోర్టుకు వెళ్లటం ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తటం ఖాయం. ఇలాంటి సందేహమే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు వచ్చింది. వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేత కుట్ర ఉదంతంపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు.
రాష్ట్రపతి పదవికి పోటీ పడకుండా ఉండేందుకు వీలుగా.. అద్వానీని దెబ్బేసేందుకు వీలుగా ప్రధాని మోడీ కుట్ర చేసినట్లుగా లాలూ ప్రసాద్ ఆరోపణ చేశారు. అద్వానీని రాష్ట్రపతిని చేయకూడదన్న ఉద్దేశంతోనే వివాదాస్పద కట్టడం కేసును తిరగదోడారంటూ ఆరోపించారు. సీబీఐ ప్రధాని చెప్పు చేతుల్లో ఉందని.. వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో ఈ రోజు అద్వానీకి వ్యతిరేకంగా సీబీఐ వ్యవహరించటం ఏమిటని ప్రశ్నించారు. అధికారపార్టీకి చెందిన కీలక నేతపై సీబీఐ కేసు వేసేందుకు ప్రయత్నించటం వెనుక మోడీ ఉన్నారన్న సందేహాల్ని వ్యక్తం చేశారు. అద్వానీ రాష్ట్రపతి అవుతారని కొద్దికాలంగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోందని.. తాజా పరిణామాలతో మోడీ దెబ్బేసినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి పదవికి పోటీలో లేకుండా చేసేందుకే మోడీ సర్కారు రాజకీయ కుట్ర చేసిందన్న విషయాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరని వ్యాఖ్యానించిన లాలూ.. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో తనను అద్వానీ కాపాడారన్న విశ్వాసం కూడా మోడీకి లేదని మండిపడ్డారు. గుజరాత్ అల్లర్ల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తొలగించాలని వాజ్ పేయ్ బలంగా వాదించినా.. అద్వానీ అడ్డుకొని కాపాడారని.. ఇప్పుడు అవేమీ గుర్తు లేనట్లుగా మోడీ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రంలో పవర్ లో ఉన్న పార్టీకి చెందిన అగ్రనేతలకు వ్యతిరేకంగా సీబీఐ వ్యవహరించటం ఇటీవల కాలంలో చూసింది లేదు. అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవటం.. లాలూ లాంటి వారు చేసే విమర్శలు చూసినప్పుడు కాసింత సందేహం బలపడకమానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/