Begin typing your search above and press return to search.

లాలూకు షాక్‌..ఇంకో ఐదేళ్ల జైలు

By:  Tupaki Desk   |   24 Jan 2018 10:41 AM GMT
లాలూకు షాక్‌..ఇంకో ఐదేళ్ల జైలు
X
ఆర్జేడీ అధినేత - బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ బ్యాడ్ టైం మామూలుగా లేన‌ట్లుంది. ఇప్పటికే దాణా కుంభకోణంలోని ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలు మ‌రో షాక్ త‌గ‌లింది. మూడో కేసులోనూ దోషిగా రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టుతేల్చింది. లాలూతోపాటు బీహార్ మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను కూడా ఈ కేసులో దోషిగా తేల్చింది. ఈ ఇద్ద‌రికీ చెరో ఐదేళ్ల జైలు శిక్ష ఖ‌రారైంది. ఇద్ద‌రీ చెరో రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించారు. ఇప్ప‌టికే రెండో కేసులో దోషిగా తేలిన‌ లాలూకు మూడున్న‌రేళ్ల జైలు శిక్ష ప‌డిన విష‌యం తెలిసిందే.

చాయ్‌ బసా ట్రెజరీ నుంచి అక్రమంగా 33.7 కోట్ల నిధులు విత్‌డ్రా చేసిన కేసులో లాలూ దోషిగా తేలారు. నిజానికి అనుమతిచ్చిన మొత్తం రూ.7.1 లక్షలు కాగా.. ఏకంగా 33 కోట్లు తీసుకోవడం గమనార్హం. అయితే ఇది కూడా సీఎం నితీశ్ కుట్రేనని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం - లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఇదే తుది తీర్పు కాదని, తమకు ఇంకా న్యాయపోరాటం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇదే దాణా స్కామ్‌ కు సంబంధించి రెండు కేసుల్లో లాలూ దోషిగా తేలి మూడున్నరేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. జగన్నాథ్ మిశ్రా దోషిగా తేలడం మాత్రం ఇదే తొలిసారి.

లాలూ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా జైల్లో ఉన్నారు. దేవ్‌ ఘర్ ఖజానా నుంచి రాత్రికిరాత్రే రూ.90 లక్షలు అక్రమంగా విత్‌ డ్రా చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. లాలూకు ఎదుర‌వుతున్న షాకుల ప‌రంప‌ర‌లో ఇది మూడ‌వ‌ది.