Begin typing your search above and press return to search.
అవినీతి చేయకపోతే ఎలా అంటున్న మాజీ సీఎం
By: Tupaki Desk | 10 April 2017 10:48 AM GMTఅవినీతి గురించి అడిగితే ఏ రాజకీయ నేతైనా ఏం చెబుతాడు? తాను చేయలేదనో.. తనకు సంబంధం లేదనో.. ప్రతిపక్షాల కుట్ర అనో చెప్పడం కామన్. కానీ అలా చెబితే ఆయన లాలూ ప్రసాద్ ఎందుకు అవుతారు? అందరి దృష్టిని ఎందుకు ఆకర్షిస్తుంటారు. తాజాగా అలాంటి కామెంట్లే లాలు చేశారు. లాలూ ఇద్దరు కుమారులు ఇటీవల 500 కోట్ల భూకుంభకోణం ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. దీనిపై వివాదం చెలరేగుతోంది. ఈ విషయాన్నే లాలును ప్రశ్నిస్తే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.
`` నా కుమారులు పేదరికంలో మగ్గి చనిపొమ్మంటారా? ఏ వ్యాపారమైనా చేసుకొనే హక్కు వారికి ఉంది` అని సింపుల్ గా చెప్పేశారు లాలూ. పాట్నా శివార్లలో రెండు ఎకరాల భూమి లాలూ ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్‌లతోపాటు ఆయన భార్య రబ్రీదేవి పేర్ల మీద రిజస్టరైంది. అయితే లాలూ గతంలో రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో వ్యాపారవేత్త హర్ష్ కొచ్చార్ కు చేసిన సాయానికి ప్రతిఫలంగా ఆ భూమిని పొందారని బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఆరోపించారు. ఇప్పుడదే రెండెకరాల భూమిలో రూ.500 కోట్ల విలువైన కంపెనీని ఏర్పాటుచేస్తున్నారు. దీనికి లారా అని పేరు పెట్టారు లాలూ. దీనర్థం ఏంటంటే.. లా అంటే లాలూ అని, రా అంటే రబ్రీ దేవి అని చెప్పారాయన.
బినామీ లావాదేవీలు ఇప్పుడు లాలూ కుమారులకు వందల కోట్ల విలువైన ప్రాజెక్ట్ పొందడానికి సాయపడ్డాయని సుశీల్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను లాలూ ఖండించారు. అప్పట్లో హర్ష్ కొచ్చార్ అత్యధిక బిడ్ వేసిన కారణంగానే ఆయనకు రైల్వే హోటళ్లకు అనుమతి ఇచ్చామని, ఈ భూమిని తన పార్టీకి చెందిన ఓ కంపెనీ కొన్నదని ఆయన చెప్పారు. మరిప్పుడు లాలూ కుమారుల పేరిట ఉన్న ఈ భూమిని వాళ్లు తమ అఫిడవిట్‌లో ఎందుకు చూపెట్టలేదని సుశీల్ మోదీ ప్రశ్నిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/